Supriya Shrinate : మోదీ పాల‌న‌లో గంట‌కో రైతు ఆత్మ‌హ‌త్య

కాంగ్రెస్ అధికార ప్ర‌తినిధి సుప్రియా శ్రీ‌నాట్

Supriya Shrinate : న‌రేంద్ర మోదీ బీజేపీ ప్ర‌భుత్వ పాల‌న‌లో దేశంలో ప్ర‌తి గంట‌కు ఒక రైతు ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డుతున్నాడ‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది కాంగ్రెస్ పార్టీ.

గ‌త ఏడాది 2021లో వ్య‌వ‌సాయంలో నిమ‌గ్న‌మైన 10,881 మంది ఆత్మ‌హ‌త్య‌ల‌తో మ‌ర‌ణించార‌ని తెలిపారు. ఇది గ‌త ఏడాది 1,64,033 చేసుకున్న ఆత్మ‌హ‌త్య‌ల్లో 6.6 శాతంగా ఉంద‌ని పేర్కొంది.

పూణేకు చెందిన ఓ రైతు ఉల్లిపాయ‌ల‌కు సంబంధించిన ఎంఎన్పీ (క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర‌) రాలేద‌ని ఆవేద‌నతో ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డం క‌ల‌క‌లం రేపింది.

ఇదిలా ఉండ‌గా దేశంలో రైతుల ఆత్మ‌హ‌త్య‌ల‌కు అధికార భార‌తీయ జ‌న‌తా పార్టీ పాల‌నా విధానాలే కార‌ణ‌మ‌ని ఆరోపించింది.

సెప్టెంబ‌ర్ 17న పూణెకు చెందిన ల‌క్ష్మ‌ణ్ కేదారి సూసైడ్ నేప‌థ్యంలో కాంగ్రెస్ అధికారి ప్ర‌తినిధి సుప్రియా శ్రీ‌నాట్ (Supriya Shrinate) ఆవేద‌న వ్య‌క్తం చేశారు. మీడియాతో మాట్లాడారు.

రైతు సూసైడ్ నోట్ లో త‌న చావుకు బీజేపీ ప్ర‌భుత్వ విధానాలే క‌రాణ‌మ‌ని, ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ బాధ్య‌త వ‌హించాలంటూ పేర్కొన‌డం క‌ల‌క‌లం రేపింది.

ల‌క్ష్మ‌ణ్ కేదారి త‌న నోట్ లో అప్పులు చెల్లించేందుకు త‌న వ‌ద్ద డ‌బ్బు లేద‌ని , నిస్సహాయ‌త‌తో త‌న జీవితం ముగించు కుంటున్నాన‌ని తెలిపాడు.

ప్ర‌తి రోజూ 30 మంది రైతులు చ‌ని పోతున్నార‌ని ప్ర‌తి గంట‌కు ఓ రైతు సూసైడ్ చేసుకుంటున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు సుప్రియా. నేష‌న‌ల్ క్రైమ్స్ రికార్డ్ బ్యూరో డేటాను ఉటంకిస్తూ 2014 నుంచి 2021 మ‌ధ్య 53,881 మందికి పై రైతులు సూసైడ్ చేసుకున్నార‌ని గుర్తు చేశారు.

సాగు చ‌ట్టాల‌ను నిర‌సిస్తూ చేప‌ట్టిన ఆందోళ‌న‌లో 700 మందికి పైగా రైతులు సూసైడ్ చేసుకున్నార‌ని గుర్తు చేశారు.

Also Read : బెంగాల్ స్కాంలో రూ. 100 కోట్లు స్వాధీనం

Leave A Reply

Your Email Id will not be published!