Farmers Protest Again : మోదీ మోసం రైతులు పోరాటానికి సిద్దం
డిసెంబర్ 11న ఎస్కేఎం ఉద్యమం
Farmers Protest Again : దేశ వ్యాప్తంగా కలకలం రేపింది రైతులు సాగించిన మహోన్నతమైన పోరాటం. సుదీర్ఘ కాలం పాటు సాగింది. సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో లక్షలాది మంది రైతులు అలుపెరుగని రీతిలో ఉద్యమించారు. తీవ్ర నిరసనలు, ఆందోళనలతో హోరెత్తించారు.
700 మందికి పైగా ఈ సుదీర్ఘ న్యాయ పరమైన పోరులో ప్రాణాలు కోల్పోయారు. నరేంద్ర మోదీ సారథ్యంలోని భారతీయ జనతా పార్టీ సంకీర్ణ ప్రభుత్వం తాను తీసుకు వచ్చిన సాగు చట్టాలను తిరిగి వెనక్కి తీసుకునేలా చేసింది.
చివరకు దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రధానమంత్రి జాతిని ఉద్దేశించి క్షమాపణలు కోరారు. ఒక రకంగా మోదీ తొమ్మిదేళ్ల పాలనా కాలంలో మొదటిసారి తప్పు ఒప్పుకోవడం. రాష్ట్రపతి సైతం బిల్లును రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. రైతులు చేసిన ఈ పోరాటం భారత దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచి పోతుంది.
వ్యవసాయ చట్టాలను రద్దు చేసిన సమయంలో అన్నదాతలు కోరిన డిమాండ్లను పరిష్కరిస్తామని మోదీ ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ ఇప్పటి వరకు ఒక్క హామీని నెరవేర్చిన దాఖలాలు లేవు. ఇదిలా ఉండగా నవంబర్ 19తో ప్రధానమంత్రి మోదీ వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు చేసిన ప్రకటనతో ఏడాది పూర్తి చేసుకుంది.
అయినా ఏ ఒక్క హామీ అమలు కాక పోవడంతో రైతులు భగ్గుమంటున్నారు. మరోసారి ఉద్యమం చేపట్టేందుకు రెడీ అవుతున్నారు. ఇందులో భాగంగా డిసెంబర్ 11న ఢిల్లీ – హర్యానా సరిహద్దు సింఘూ వద్ద సమావేశం కావాలని సంయుక్త కిసాన్(Farmers Protest Again) మోర్చా నిర్ణయించింది. మలి దశ పోరాటం కోసం చర్చిస్తామని ఎస్కేఎం నేతలు వెల్లడించారు.
Also Read : ఉచిత విద్యుత్ కు కేంద్రం అడ్డంకి