Farooq Abdullah : ఫరూక్ అబ్దుల్లా షాకింగ్ కామెంట్స్
ఎంకే స్టాలిన్ పీఎం అయితే బెటర్
Farooq Abdullah Stalin : జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. డీఎంకే చీఫ్, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ పై(Farooq Abdullah Stalin) కీలక వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు చర్చకు దారి తీసింది. సీఎం జన్మదిన వేడుకలు తమిళనాడులో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జరిగిన జన్మదినోత్సవ వేడుకలకు దేశంలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రముఖులు, ఆయా పార్టీల నేతలు హాజరయ్యారు. వీరిలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ , జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా కూడా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ప్రసంగించారు అబ్దుల్లా. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా ప్రజల సంక్షేమం కోసం డీఎంకే కృషి చేస్తోందని కొనియాడారు. ఇదే క్రమంలో ఎంకే స్టాలిన్ ప్రధానమంత్రి అయితే దేశానికి మేలు చేకూరుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా విస్మయానికి లోనయ్యారు. బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ కూడా ఎంకే స్టాలిన్(MK Stalin) ను ప్రత్యేకంగా నాయకత్వ నైపుణ్యం కలిగిన నాయకుడిగా ప్రశంసించారు.
బీజేపీని ఎదుర్కొనేందుకు దేశ వ్యాప్తంగా విపక్షాలు ఏకం కావాలని పిలుపునిచ్చారు. విపక్షాల ఐక్యతను కాంగ్రెస్ పార్టీ కోరుకుంటోందని మరోసారి స్పష్టం చేశారు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే(Mallikarjun Kharge). ఇదిలా ఉండగా సీఎం ఎంకే స్టాలిన్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. రాబోయే రోజుల్లో ఇటు తమిళనాడు లోనూ అటు పాండిశ్చేరిలోనూ డీఎంకే సత్తా చాటేలా ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించారు. మొత్తంగా ఫరూక్ అబ్దుల్లా చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.
Also Read : అదానీ వివాదంపై సుప్రీం కీలక తీర్పు