Kodali Nani : తండ్రీ కొడుకులు అవకాశవాదులు – కొడాలి
జగన్ రెడ్డి ముందు ఓ బచ్చా
Kodali Nani : మాజీ మంత్రి కొడాలి నాని నిప్పులు చెరిగారు. యువ గళం పేరుతో నారా లోకేష్ చేపట్టిన పాదయాత్రపై సీరియస్ కామెంట్స్ చేశారు. ఏపీ సీఎం సందింటి జగన్ మోహన్ రెడ్డి గురించి మాట్లాడేంత సీన్ , అర్హత లోకేష్ కు లేదన్నారు. కనీసం వార్డు మెంబర్ గా కూడా గెలవలేని లోకేష్ అవాకులు చెవాకులు పేలితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
ఎన్టీఆర్ వారసులకు టీడీపీని ఇవ్వకుండా కుట్ర పన్నుతున్నారంటూ ఆరోపించారు కొడాలి నాని. ఆయనకు రాజకీయ అనుభవం లేదన్నారు. తమ ప్రభుత్వంపై విమర్శలు చేసేంత దమ్ము లేదన్నారు. ముందు తన తండ్రి ఏపీ ప్రజలకు ఇచ్చిన హామీల గురించి తన పాదయాత్రలో చెబితే బాగుంటుందన్నారు కొడాలి నాని(Kodali Nani) .
తండ్రీ కొడుకులు పచ్చి అవకాశవాదులని వారికి పదవులపై ఉన్నంత ధ్యాస ప్రజా సేవపై లేదన్నారు. తాను ఐటీ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఎన్ని పరిశ్రమలు తీసుకు వచ్చారో, ఎంత మందికి ఉద్యోగాలు కల్పించారో చెప్పాలని డిమాండ్ చేశారు కొడాలి నాని. పవన్ కళ్యాణ్ కు సీఎం కేసీఆర్ వార్నింగ్ ఇస్తే ఏపీకి వచ్చాడంటూ ఎద్దేవా చేశారు మాజీ మంత్రి.
చంద్రబాబు, పవన్ , లోకేష్ ఈ ముగ్గురిని మానసిక వైకల్య కేంద్రంలో జాయిన్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. లేక పోతే జనాన్ని పిచ్చి వాళ్లు చేసే ప్రమాదం ఉందన్నారు కొడాలి నాని.
వీళ్లను జనం తరిమి కొట్టే రోజు తప్పకుండా వస్తుందన్నారు. రాబోయే ఎన్నికల్లో అడ్రస్ లేకుండా పోవడం ఖాయమన్నారు కొడాలి నాని(Kodali Nani) .
Also Read : బీజేపీ లక్ష్యం వైసీపీ అంతం