Feeding Pigeons: పావురాలకు తిండి పెడితే ఇకపై జైలుకే !
పావురాలకు తిండి పెడితే ఇకపై జైలుకే !
Feeding Pigeons : పావురాల ప్రేమికులకు బ్రిహన్ముంబై మున్సిపల్ కార్పోరేషన్(బీఎమ్సీ) షాక్ ఇచ్చింది. ఇకపై పబ్లిక్ లో పావురాలకు తిండిపెడితే జైలు శిక్ష తప్పదంటూ ఆదేశాలు జారీ చేసింది. మహారాష్ట్రలోని ముంబై హైకోర్టు (Bombay High Court) జులై 31వ తేదీన బ్రిహన్ముంబై మున్సిపల్ కార్పోరేషన్(బీఎమ్సీ)కు కీలక ఆదేశాలు జారీ చేసింది. పబ్లిక్ ప్లేసుల్లో పావురాలకు తిండిపెట్టే వారిపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించింది.
Feeding Pigeons is a Crime in Public Place
ముంబై హైకోర్టు ఆదేశాల ప్రకారం… పబ్లిక్, చారిత్రక ప్రదేశాల్లో పావురాలకు తిండిపెట్టడం నిషేదం. పావురాల కారణంగా ప్రజల ఆరోగ్యం పాడవుతోందని, శ్వాసకోశ సంబంధిత సమస్యలు వస్తున్నాయని హైకోర్టు పేర్కొంది. ప్రజల ఆరోగ్యం, వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, ఈ కొత్త రూల్ గురించి ప్రజలకు తెలియకుండా పోయింది. ఈ నేపథ్యంలోనే ఓ వ్యక్తి స్కూటీపై ఎల్జీ రోడ్డులోని ఖాబూతర్ఖానా దగ్గరకు వచ్చాడు. సంచుల్లో తెచ్చిన దానాను అక్కడి పావురాలకు వేశాడు. అనంతరం అక్కడినుంచి వెళ్లిపోయాడు.
అయితే ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. అతడి కోసం గాలిస్తున్నారు. కొత్త రూల్ తెచ్చిన తర్వాత పావురాలకు తిండి పెట్టి… కేసులో చిక్కుకున్న మొదటి వ్యక్తి అతడే కావటం గమనార్హం. ఆ కొత్త రూల్ గురించి తెలియక ఎంత మంది జైలు పాలవుతారో చూడాలి మరి.
Also Read : IAF C-295: భారత్ కు చేరిన చివరి సీ-295 ! అప్పగింతలు పూర్తి చేసిన స్పెయిన్ !
