Indigo Plane Fire : ఇండిగో ఫ్లైట్ ఇంజ‌న్ లో మంట‌లు

ఢిల్లీ ఎయిర్ పోర్టులో త‌ప్పిన ముప్పు

Indigo Plane Fire : ఇటీవ‌ల దేశంలో విమాన ప్ర‌మాదాలు త‌రుచూ చోటు చేసుకుంటుండ‌డం కొంత ఇబ్బందిని క‌లిగిస్తోంది. తాజాగా ఇండిగో విమానం ఇంజ‌న్ ఢిల్లీలో టేకాఫ్ చేసే కంటే కొద్ది క్ష‌ణాల ముందు మంట‌లు అంటుకున్నాయి. దీంతో పెను ప్ర‌మాదం త‌ప్పింది. ఈ విమానం ఢిల్లీ నుంచి బెంగ‌ళూరుకు వెళ్లాల్సి ఉంది.

6ఇ-2131 అనే నంబ‌ర్ క‌లిగిన ఇండిగో విమానంలో ప్ర‌యాణికులంతా సుర‌క్షితంగా ఉన్నార‌ని ఇండియో ఎయిర్ లైన్స్ ప్ర‌క‌టించింది. టేకాఫ్ స‌మ‌యంలో ఒక ఇంజ‌న్ లో మంట‌లు(Indigo Plane Fire) వ్యాపించిన‌ట్లు వీడియోలో స్ప‌ష్టంగా తేలింది. ఈ ఘ‌ట‌న నిన్న రాత్రి చోటు చేసుకుంది. ఇంజ‌న్ లో ఉన్న‌ట్టుండి మంట‌లు చెల‌రేగ‌డంతో వెంట‌నే అప్ర‌మ‌త్త‌మైన సిబ్బంది ఫ్లైట్ ను నిలిపి వేశారు.

ఈ విమానం ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లోనే ఉండి పోయింది. సిబ్బందితో పాటు ప్ర‌యాణికుల‌కు ఏమీ కాలేద‌ని ఇండిగో సంస్థ తెలిపింది. ఎయిర్ బ‌స్ ఏ320 విమానంలో 184 మంది ప్ర‌యాణిస్తున్నారు. రాత్రి 9.45 గంట‌ల ప్రాంతంలో చోటు చేసుకోవ‌డంతో ప్ర‌యాణికుల‌ను వెంట‌నే బ‌య‌ట‌కు తీసుకు రాలేదు.

ప్రయాణికులు రాత్రి 11 గంట‌ల త‌ర్వాత విమానం నుంచి దిగి అర్ధ‌రాత్రి స‌మ‌యంలో మ‌రో విమానంలో జ‌ర్నీ ఏర్పాట్లు చేసింది ఇండిగో. క్ష‌ణాల్లోనే మంట‌ల‌ను ఆర్పి వేశామ‌ని ఎయిర్ లైన్స్ తెలిపింది.

ఇదిలా ఉండ‌గా ఫ్లైట్ ఐదు నుండి ఏడు సెక‌న్ల లో టేకాఫ్ అయ్యేది. అక‌స్మాత్తుగా రెక్క‌ల నుండి భారీ నిప్పు ర‌వ్వ‌లు వ‌చ్చాయి. అది పెద్ద మంటగా మారింది . వెంట‌నే ఫ్లైట్ ను నిలిపి వేశార‌ని తెలిపారు ఓ ప్ర‌యాణికుడు.

Also Read : కాలుష్య వ్య‌తిరేక‌ ప్ర‌చారంపై చెరో దారి

Leave A Reply

Your Email Id will not be published!