Gandhi : గాంధీపై ఐదుసార్లు హ‌త్యాయ‌త్నం

చివ‌ర‌కు గాడ్సే చేతిలో మ‌రణం

Gandhi : ఈ దేశం మ‌రిచిపోని మ‌హోన్న‌త‌మైన మాన‌వుడు మ‌హాత్మా గాంధీ. అహింస అనే ఆయుధంతో ఆంగ్లేయులపై యుద్దం ప్ర‌క‌టించారు.

1948 జ‌న‌వ‌రి 30న గాడ్సే చేతిలో మ‌ర‌ణించ‌క ముందు గాంధీపై(Gandhi) ఐదుసార్లు హ‌త్యా చేసేందుకు య‌త్నం జ‌రిగింది. 1934 జూన్ 25న మ‌హారాష్ట్రంలోని పూణెలో గాంధీజీ ప్ర‌సంగించేందుకు వ‌చ్చిన స‌మ‌యంలో కుట్ర‌దారులు బాపు ఉన్నారంటూ భావించి కారుపై బాంబు దాడికి పాల్ప‌డ్డారు.

1944 జూలైలో గాంధీజీ విశ్రాంతి కోసం పంచ‌గ‌నికి వెళ్లారు. నిర‌స‌న‌కారుల స‌మూహం గాంధీకి వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు. గాంధీజీ (Gandhi)గ్రూపు నాయ‌కుడు నాథూరామ్ ను చ‌ర్చ‌కు ఆహ్వానించారు.

దానిని వారు తిర‌స్క‌రించారు. ప్రార్థ‌నా స‌మావేశంలో గాడ్సే ఒక బాకుతో గాంధీజీ వైపు దూసుకు పోతున్న‌ట్లు క‌నిపించాడు. అదృష్ట‌వ‌శాత్తు స‌తారాకు చెందిన మ‌ణిశంక‌ర్ పురోహిత్, భిల్లారే గురూజీ త‌ప్పించ బ‌డ్డాడు గాంధీ.

ఇదే ఏడాది 1944 సెప్టెంబ‌ర్ లో మ‌హాత్మా గాంధీ సేవాగ్రామ్ నుంచి బొంబాయికి ప్ర‌యాణం చేసిన‌ప్పుడు అక్క‌డ జిన్నాతో చ‌ర్చ‌లు ప్రారంభం కావాల్సి ఉంది.

గాడ్సే త‌న ముఠాతో క‌లిసి గాంధీని బొంబాయిని విడిచి పెట్ట‌కుండా ఆపేందుకు ఆశ్రమాన్ని ముట్ట‌డించాడు. త‌దుప‌రి విచార‌ణలో డాక్ట‌ర్ సుశీల న‌య్య‌ర్ నాథురామ్ గాడ్సేను గాంధీకి చేరుకోకుండా ఆశ్ర‌మం వ‌ద్ద ప్ర‌జ‌లు నిర్బంధించారంటూ, అత‌ని వ‌ద్ద ఓ బాకు దొరికిందంటూ వెల్ల‌డించారు.

1946 జూన్ నెల‌లో పూణేకు ప్ర‌త్యేక రైలులో వెళుండ‌గా చంపేందుకు య‌త్నించారు. 1948 జ‌న‌వ‌రి 20న బిర్లా భ‌వ‌న్ లో జ‌రిగిన స‌మావేశంలో బాపుపై మ‌రోసారి దాడికి కుట్ర జ‌రిగింది.

మ‌ద‌న్ లాల్ ప‌హ్వా, నాథురామ్ గాడ్సే, నారాయ‌ణ్ ఆప్టే, విష్ణు క‌ర్క‌రే, దిగంబ‌ర్ బాడ్గే, గోపాల్ గాడ్సే, శంక‌ర్ కిష్ట‌య్య హ‌త్య ను అమ‌లు చేసేందుకు హాజ‌రు కావాల‌ని ప్లాన్ చేశారు.

బాంబు విసిరి, కాల్చాల‌ని ప్లాన్ చేశారు. మ‌ద‌న్ లాల్ ను ప‌ట్టుకోవ‌డంతో ఆ వ్యూహం వ‌ర్క‌వుట్ కాలేదు. చివ‌ర‌కు 30న గాడ్సే స‌క్సెస్ అయ్యాడు.

మొత్తంగా జాతిని ఏక‌తాటిపై కోట్లాది మందిని న‌డిపించిన మ‌హోన్న‌త‌మైన మాన‌వుడిని కోల్పోవ‌డం బాధాక‌రం.

Also Read : అత‌డో ఆయుధం అత‌డే సైన్యం

Leave A Reply

Your Email Id will not be published!