Flight Emergency Landing: బ్యాంకాక్-మాస్కో విమానంలో పొగలు ఢిల్లీలో ఎమర్జెన్సీ ల్యాండింగ్

బ్యాంకాక్-మాస్కో విమానంలో పొగలు ఢిల్లీలో ఎమర్జెన్సీ ల్యాండింగ్

Flight Emergency Landing : దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో బ్యాంకాక్-మాస్కో విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ చేసారు. బ్యాంకాక్ నుంచి మాస్కోకు బయలుదేరిన ఎస్‌యూ 273 విమానంలో పొగలు కనిపించడంతో ఢిల్లీలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు.

Flight Emergency Landing in Bangkok

ఢిల్లీ విమానాశ్రయ వర్గాల సమాచారం ప్రకారం, మాస్కో బయలుదేరిన విమానంలో పొగలు రావడాన్ని గుర్తించిన సిబ్బంది మధ్యాహ్నం 3.50 గంటలకు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌ కు సమాచారం ఇచ్చారు. దీనితో ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు అనుమతిస్తూ ఢిల్లీ విమానాశ్రయంలో అత్యవసర స్థితిని ప్రకటించారు. 425 మంది ప్రయాణికులతో ఉన్న విమానం సురక్షితంగా ల్యాండ్ అయిందని, అంతా సురక్షితంగా ఉన్నారని ఎయిర్‌పోర్ట్ అధికారులు తెలిపారు. ప్రస్తుతం విమానం సేఫ్టీ ఇన్‌స్పెక్షన్లు జరుగుతున్నాయి. విమానంలో పొగలు రావడానికి కారణం ఏమిటనేది ఇంకా తెలియాల్సి ఉంది.

Also Read : Rahul Gandhi: రాహుల్‌ ను హిందూమతం నుంచి బహిష్కరించిన శంకరాచార్య

Leave A Reply

Your Email Id will not be published!