Justice UU Lalit : పెండింగ్ కేసుల పరిష్కారంపై ఫోకస్
నూతన సీజేఐ జస్టిస్ యుయు లలిత్
Justice UU Lalit : ప్రజాస్వామ్యంలో న్యాయ వ్యవస్థ కీలకమైనది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో మౌలిక వసతుల లేమి తీవ్ర ఇబ్బంది పెడుతోంది. ప్రధానంగా అత్యధికంగా కేసులు పెండింగ్ లో ఉన్నాయి.
వాటి పరిష్కారం కోసం తాను కృషి చేస్తానని , ఇదే తన ముందున్న లక్ష్యమని సీజేఐగా కొలువు తీరిన జస్టిస్ యుయు లలిత్(Justice UU Lalit) స్పష్టం చేశారు. 48వ ప్రధాన న్యాయమూర్తిగా 16 నెలల కాలం పాటు పని చేసిన జస్టిస్ నూతలపాటి వెంకట రమణ పదవీ విరమణ పొందారు.
తాజాగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్ లలిత్ కేవలం 74 రోజుల పాటే ఉంటారు. ఆ తర్వాత జస్టిస్ డీవై చంద్రచూడ్ వస్తారు. ఈ సందర్భంగా తాను ఏం చేయాలని అనుకుంటున్నాననే దానిపై క్లారిటీ ఇచ్చారు జస్టిస్ లలిత్.
మూడు రంగాలపై ఫోకస్ పెడతానని చెప్పారు. కనీసం ఒక రాజ్యాంగ ధర్మాసనం ఉండేలా కృషి చేస్తానని చెప్పారు. చట్టాన్ని స్పష్టతతో, సాధ్యమైన మార్గాన్ని రూపొందించడమే అత్యున్నత న్యాయ స్థానం పాత్ర అని తాను ఎప్పుడూ నమ్ముతానని చెప్పారు.
సమస్యలకు తక్షణమే పరిష్కారం లభించాలంటే వీలైనంత త్వరగా బెంచీలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు జస్టిస్ యుయు లలిత్.
రాజ్యాంగ బెంచ్ ల ముందు ఉన్న కేసుల జాబితా, త్రిసభ్య బెంచ్ లకు ప్రత్యేకంగా సూచించే విషయాల గురించి తాను పని చేయాలని అనుకుంటున్నట్లు స్పష్టం చేశారు సీజేఐ. స్పష్టమైన పాలన అందించేందుకు కృషి చేస్తానని చెప్పారు.
సీజేఐ ఎన్వీ రమణ చేసిన కృషిని ప్రత్యేకంగా ప్రస్తావించారు జస్టిస్ యుయు లిలిత్.
Also Read : ఫుట్ బాల్ ఫెడరేషన్ పై నిషేధం ఎత్తివేత