Anantapur Central University: అనంతపురం సెంట్రల్‌ వర్సిటీలో 150 మంది విద్యార్ధులకు అస్వస్థత

అనంతపురం సెంట్రల్‌ వర్సిటీలో 150 మంది విద్యార్ధులకు అస్వస్థత

Anantapur Central University : అనంతపురంలోని సెంట్రల్‌ యూనివర్సిటీలో 150 మందికి పైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. గురువారం రాత్రి విద్యార్ధులు తీసుకున్న ఆహారం కలుషితం కావడంతో… పలువురు విద్యార్ధులు అస్వస్థతకు గురైనట్లు సమాచారం. సుమారు 150 మంది విద్యార్థులకు వాంతులు, విరోచనాలయ్యాయి. దీనితో యూనివర్సిటీ (Anantapur Central University) సిబ్బంది.. వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించి.. చికిత్స అందిస్తుంది. అయితే యూనివర్సిటీలోని కళాశాల యాజమాన్యం ఈ విషయాన్ని గోప్యంగా ఉంచింది.

Anantapur Central University Updates

ప్రస్తుతం యూనివర్సిటీలో యూజీ, పీజీ, పీహెచ్‌డీ కోర్సులకు కొత్తగా ప్రవేశాలు జరుగుతున్నాయి. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి విద్యార్థులకు వర్సిటీలో ప్రవేశాలు కల్పిస్తుంటారు. ఉత్తర్‌ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, పంజాబ్‌, రాజస్థాన్‌ తదితర రాష్ట్రాల విద్యార్థులు అడ్మిషన్లు తీసుకుని వసతి గృహాల్లో ఉంటున్నారు. అయితే ఇక్కడి వాతావరణం విద్యార్థులకు పడకపోవడంతో గత మూడు రోజులుగా దగ్గు, జలుబు, గొంతు నొప్పి, జ్వరంతో బాధపడుతున్నారు. దీనికి తోడు గురువారం రాత్రి తీసుకున్న ఆహారం కలుషితం కావడంతో విద్యార్ధులు అస్వస్థతకు గురయినట్లు సమాచారం. వైరల్‌ ఫీవర్‌తో బాధపడుతున్న విద్యార్థులను ప్రత్యేక గదుల్లో ఉంచి వారికి ప్రభుత్వ వైద్య సిబ్బందితో రక్త పరీక్షలు చేయించి చికిత్స అందిస్తున్నారు. విద్యార్థులు ఇక్కడి వాతావరణానికి అలవాటు పడ్డాక వారి ఆరోగ్యం కుదుటపడే అవకాశం ఉంటుందని డాక్టర్‌ తెహర్నిశ తెలిపారు.

Also Read : TTD Chairman: అస్సాం సీఎంతో టీటీడీ ఛైర్మన్‌ భేటీ ! గువాహటిలో శ్రీవారి ఆలయ నిర్మాణం !

Leave A Reply

Your Email Id will not be published!