Asia Business Women : ఫోర్బ్స్ టాప్ 20 మ‌హిళ‌ల్లో మ‌నోళ్లు

న‌మితా థాప‌ర్..గ‌జ‌ల్ అల‌ఘ్..సోమ మండ‌ల్

Asia Business Women : ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన ప్ర‌ముఖ సంస్థ ఫోర్బ్స్ టాప్ 20 మ‌హిళా వ్యాపార‌వేత్త‌ల(Asia Business Women) జాబితాను ప్ర‌క‌టించింది. ఇందులో భార‌త దేశానికి చెందిన బిజినెస్ విమెన్స్ ల‌లో న‌మితా థాప‌ర్ , గ‌జ‌ల్ అల‌ఘ్ , సోమ మండ‌ల్ కు చోటు ద‌క్కింది. మ‌హిళా వ్యాపార‌వేత్త‌లు గ‌ణనీయ‌మైన ఆదాయం గ‌డించారు.

వ్యాపారాన్ని స‌మ‌ర్థ‌వంతంగా నిర్వ‌హించడంలో కీల‌క పాత్ర పోషించారు. ఇందులో భార‌త దేశానికి చెందిన ఎంక్యూర్ ఫార్మా ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్ న‌మితా థాప‌ర్ , మామార్త్ స‌హ వ్య‌వ‌స్థాప‌కుడు గ‌జ‌ల్ అల‌గ్ , సెయిల్ చైర్ ప‌ర్స‌న్ సోమ మొండ‌ల్ చోటు ద‌క్కించుకున్నారు.

ఇదిలా ఉండ‌గా చోటు ద‌క్కించుకున్న భార‌తీయ మ‌హిళా మ‌ణుల ప‌రంగా చూస్తే వారు సాధించిన విజ‌యాలు స్పూర్తి దాయ‌కంగా ఉన్నాయ‌ని పేర్కొంది ఫోర్బ్స్. సోమ మొండ‌ల్ భువ‌నేశ్వ‌ర్ కు చెంద‌న రూర్కేలా లోని ఎన్ఐటీలో ఇంజ‌నీరింగ్ చ‌దివారు. నేష‌న‌ల్ అల్యూమినియం కోలో చేరింది. డైరెక్ట‌ర్ గా ఎదిగింది.

2021లో ప్ర‌భుత్వ నిర్వ‌హ‌ణ‌లో ఉన్న సెయిల్ కు చీఫ్ గా ఎంపికైన మొద‌టి మ‌హిళ‌గా నిలిచింది. ఆమె నాయ‌క‌త్వంలో సెయిల్ సంస్థ వార్షిక ఆదాయం 50 శాతం పెరిగి $1.03 ట్రిలియ‌న్ల‌కు పైగా పెరిగిందని ఫోర్బ్స్ వెల్ల‌డించింది. ఇక న‌మితా థాప‌ర్ వృత్తిరీత్యా సీఏ. పూణేకు చెందిన ఎంక్యూర్ ఫార్మా ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేస్తున్నారు.

దీని వ్యాపారం $730 మిలియ‌న్ల‌కు చేరింది. 2007లో త‌న తండ్రి స‌తీష్ మెహ‌తా స్థాపించిన కంపెనీలో చీఫ్ ఫైనాన్షియ‌ల్ ఆఫీస‌ర్ గా చేరారు. ఆమె యూట్యూబ్ లో టాక్ షో కూడా నిర్వ‌హిస్తోంది. మ‌రో మ‌హిళా వ్యాపారవేత్త గ‌జ‌ల్ అల‌ఘ్ కూడా జాబితాలో చేరడం విశేషం. ఆమె వ‌య‌సు 34 ఏళ్లు. మామార్త్ ను హోస్ట్ చేస్తుంది.

డెర్మావో, ఆక్వాలోజికా, ఆయుగా, సీక్వోయా క్యాపిట‌ల్ ఇండియా నేతృత్వంలోని $52 మిలియ‌న్ల నిధుల రౌండ్ ను ముగించింది. ఆ త‌ర్వాత అది యూనికార్న్ గా మారింది. దీని విలువ $1.2 బిలియ‌న్లు. గ‌త ఆర్థిక సంవ‌త్స‌రంలో $121 మిలియ‌న్ల ఆదాయాన్ని రెట్టింపు చేసింది.

Also Read : ట్విట్ట‌ర్ యూజ‌ర్ల‌కు మ‌స్క్ వార్నింగ్

Leave A Reply

Your Email Id will not be published!