Supreme Court : బలవంతపు గర్భం అత్యాచారమే
అబార్షన్ పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
Supreme Court : వివాహిత స్త్రీ బలవంతంగా గర్భం దాల్చడాన్ని వైవాహిక అత్యాచారంగా పరిగణించాల్సి వస్తుందని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. వివాహితతో సమానంగా అవివాహిత మహిళ కూడా 24 వారాల వరకు అబార్షన్ చేసుకునేందుకు పర్మిషన్ ప్రకటించడానికి ఎంటీపీ చట్టంపై కోర్టు వ్యాఖ్యానించింది. ఇందుకు సంబంధించి అత్యాచార బాధితుల్లో వివాహిత మహిళలు కూడా భాగం కావచ్చని కోర్టు పేర్కొంది.
వైవాహిక అత్యాచారం (రేప్ ) గా పరిగణించాలని స్పష్టం చేసింది కోర్టు. మహిళలు పునరుత్పత్తి హక్కులు, శారీరక స్వయం ప్రతిపత్తిపై సుప్రీంకోర్టు గురువారం కీలకమైన, సంచలన తీర్పు చెప్పింది. అత్యాచారం అంటే సమ్మతి (అనుమతి) లేకుండా లైంగిక సంపర్కం, సన్నిహిత భాగస్వామి హింస అనేది వాస్తవం.
ఈ సందర్భంలో మహిళ కూడా బలవంతంగా గర్భవతి కావచ్చని సుప్రీంకోర్టు(Supreme Court) ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధనంజయ వై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రగ్నెన్సీ (ఎంటీపీ) చట్టం ప్రకారం రేప్ అనే పదం భర్తల బలవంతపు సెక్స్ వల్ల గర్భం దాల్చుతుందని స్పష్టం చేసింది.
గర్భిణీ స్త్రీ బలవంతంగా గర్భం దాల్చిందని ఆరోపించబడిన ఏదైనా గర్భం రేప్ అంటూ న్యాయమూర్తులు ఏఎస్ బోపన్న, జేబీ పార్థివాలతో కూడిన ధర్మాసనం కుండ బద్దలు కొట్టింది. ఈ హక్కును హరించడం మహిళ గౌరవ హక్కుకు భంగం కలిగించడమే అవుతుందని పేర్కొంది. 24 వారాల గర్భాన్ని రద్దు చేయాలంటూ చేసిన అభ్యర్థనను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కలకలం రేపింది.
Also Read : నిర్మాత ఏక్తా..శోభా కపూర్ కు అరెస్ట్ వారెంట్