Former CM Prafulla Kumar: డ్రైవర్‌ను చెప్పుతో కొట్టిన అస్సాం మాజీ సీఎం కుమార్తె
డ్రైవర్‌ను చెప్పుతో కొట్టిన అస్సాం మాజీ సీఎం కుమార్తె
Prafulla Kumar : మద్యం మత్తులో తనను దూషిస్తున్నాడంటూ అస్సాం మాజీ ముఖ్యమంత్రి కుమార్తె ప్రజోయితా కశ్యప్…. తమ వద్ద పనిచేస్తున్న డ్రైవర్ పై చెప్పుతో దాడి చేసింది. డ్రైవర్ ను మోకాళ్లపై కూర్చోబెట్టి అతడిని చెప్పుతో కొట్టింది. హై సెక్యూరిటీ మధ్య డ్రైవర్‌ను మొకాళ్లపై కూర్చొబెట్టి మాజీ సీఎం(Prafulla Kumar) కుమార్తె చెప్పుతో కొడుతున్న దృశ్యాల్ని స్థానికులు వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దిస్పుర్ ప్రాంతంలోని ఎమ్మెల్యేల భద్రతా క్యాంపస్ హాస్టల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రఫుల్లకుమార్ మహంత రెండుసార్లు అస్సాం ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం ఆయన శాసనసభ్యుడు కాకపోయినా వారి కుటుంబం ఎమ్మెల్యే క్వార్టర్లలో నివాసం ఉండడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే…
Prafulla Kumar Daughter..
అస్సాం రాజధాని గౌహతిలోని శివారు ప్రాంతమైన డిస్పూర్‌లోని రాష్ట్ర ప్రజాప్రతినిధులు నివాసం ఉండే ఎమ్మెల్యే హాస్టల్‌లో మాజీ సీఎం ప్రఫుల్ల కుమార్ మహంత(Prafulla Kumar) కుటుంబ సభ్యులు నివాసం ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రఫుల్ల కుమార్ మహంత కుమార్తె ప్రజోయితా కశ్యప్ ఆటోడ్రైవర్‌ను దుర్భాషలాడుతూ చితక బాదారు. ఈ దృశ్యాన్ని కొంతమంది స్థానికులు రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో బయటకు వచ్చింది. ఈ ఘటనపై స్పందించిన మాజీ సీఎం ప్రఫుల్ల కుమార్ మహంత కుమార్తె ప్రజోయితా కశ్యప్… డ్రైవర్ తమ వద్ద చాలా కాలంగా పని చేస్తున్నాడని తెలిపారు. ‘‘అతను ఎప్పుడూ మద్యం మత్తులో ఉండి నన్ను వేధిస్తూ, దురుసుగా ప్రవర్తిస్తున్నాడు. అతడికి ఉన్న సమస్యల వల్ల అలా ప్రవర్తిస్తున్నాడని సహనంతో ఉన్నాం. అలా చేయవద్దని ఎన్నిసార్లు చెప్పినా అతడిలో ఎటువంటి మార్పు రాలేదు. సోమవారం నేను ఇంట్లో ఉండగా తలుపును గట్టిగా బాదుతూ, బయటకు రావాలని దూషించాడు. అందుకే అతడికి తగిన బుద్ధి చెప్పాను’ అని ప్రజోయితా తెలిపారు. అయితే డ్రైవర్ ప్రభుత్వ ఉద్యోగా లేదా వ్యక్తిగతంగా ఏర్పాటుచేసుకున్నారా? అనే విషయంపై స్పష్టత లేదు.
Also Read : Yogi Adityanath: కుంభమేళాలో ఓ కుటుంబం 30 కోట్ల ఆదాయం సంపాదించింది – సీఎం యోగి