Former Minister Raja Bhaiya: మాజీ మంత్రి రాజా భయ్యాపై గృహ హింస కేసు నమోదు
మాజీ మంత్రి రాజా భయ్యాపై గృహ హింస కేసు నమోదు
Raja Bhaiya : ఉత్తరప్రదేశ్‌లోని కుందా ఎమ్మెల్యే, మాజీ మంత్రి రఘురాజ్ ప్రతాప్ సింగ్ అలియాస్ రాజా భయ్యాపై గృహహింస కేసు నమోదైంది. ఆయన సతీమణి భన్వి సింగ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఢిల్లీలోని సఫ్దర్ జంగ్ ఎన్‌క్లేవ్ పోలీస్ స్టేషన్‌లో ఆయనపై మార్చి 7న ఎఫ్‌ఐఆర్ నమోదైనట్లు తెలిపారు. రాజా భయ్యా కొన్నేళ్లుగా శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నట్లు ఆమె ఫిర్యాదులో ఆరోపించినట్లు పోలీసులు వెల్లడించారు. కుందా నియోజకవర్గం నుంచి ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రాజాభయ్యా… గతంలో బీజేపీ, సమాజ్‌వాదీ పార్టీల నుంచి మంత్రిగానూ పనిచేశారు. 2018లో జనసత్తా దళ్(లోక్‌తంత్రిక్) పార్టీని స్థాపించారు.
Raja Bhaiya Police Case
అయితే, గత కొన్నేళ్లుగా భార్యాభర్తలు విడిగా ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు. రాజాభయ్యా(Raja Bhaiya) చాలాకాలంగా తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారని, ఇప్పుడు తన ప్రాణాలకు ముప్పు ఉందనే భయాలున్నాయని తన ఫిర్యాదులో భన్విసింగ్ పేర్కొన్నారు. అత్తమామలు సైతం తనను వేధిస్తున్నారని చెప్పారు. ఎన్ని వేధింపులు ఎదురైనా వివాహబంధాన్ని కాపాడుకునేందుకు తొలుత చట్టపరమైన చర్యలకు తాను దూరంగా ఉన్నానని, అయినప్పటికీ వేధింపులు ఆగకపోవడంతో ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని తెలిపారు. ఆమె ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. బన్వి సింగ్ గతంలోనూ ఇవే ఆరోపణలపై జాతీయ మహిళా కమిషన్, ఢిల్లీ స్టేట్ లీగల్ సర్వీసెస్ అధారిటీని ఆశ్రయించారు. రాజ్యభయ్యా ముఫ్పై ఏళ్లుగా గృహహింసకు పాల్పడుతున్నారంటూ 2023 ఆగస్టులో ఆమె ఒక అఫిడవిట్ ను ఫ్యామిలీ కోర్టులో దాఖలు చేసినట్టు కూడా చెబుతున్నారు.
Also Read : Nara Lokesh: ఎమ్మెల్యే కోటంరెడ్డి చేసిన పనికి ఫిదా అయిన మంత్రి లోకేష్ !