Foxconn Apple Air Pods : ప్రముఖ యాక్ససెసరీ తయారీ కంపెనీ ఫాక్స్ కాన్ సంచలన ప్రకటన చేసింది. ఇప్పటికే బెంగళూరుతో పాటు హైదరాబాద్ ను ఎంచుకుంది. ఇందులో భాగంగా తీపి కబురు చెప్పింది. హైదరాబాద్ లోని ఫాక్స్ కాన్ ఫ్యాక్టరీలో యాపిల్ ఎయిర్ పాడ్ లను తయారు చేయనున్నట్లు వెల్లడించింది. డిసెంబర్ నాటికి ఉత్పత్తిని ప్రారంభించాలని చూస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్ ప్లాంట్ కోసం 400 మిలియన్ డాలర్ల పెట్టుబడిని ఆమోదించింది.
Foxconn Apple Air Pods Unit will Start in Hyderabad
వచ్చే ఏడాది 2024 నాటికి పూర్తి చేయాలని నిశ్చయించింది. ఇప్పటికే ఫాక్స్ కాన్ యాపిల్ కు సంబంధించిన ఐ ఫోన్లను తయారు చేస్తోంది. తాజాగా తీసుకున్న నిర్ణయం మేరకు యాపిల్ కు చెందిన వైర్ లెస్ ఇయర్ బడ్స్ , ఎయిర్ పాడ్ లను తయారు చేయనుంది.
ప్రస్తుతం యాపిల్ తయారీదారుగా ఉంది ఫాక్స్ కాన్(Foxconn Apple Air Pods). ఎయిర్ పాడ్స్ కు ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున డిమాండ్ ఉంటోంది. 2022 నాటికి మొత్తం మొబైల్ యాక్సెసరీ మార్కెట్ లో యాపిల్ కంపెనీ వాటా 36 శాతంగా ఉందని తేలింది. ఇక యాపిల్ తర్వాతి స్థానాల్లో శాంసంగ్ 7.5 శాతం, షియోమీ 4.4 శాతం, బోట్ 4 శాతం , ఒప్పో 3 శాతం మార్కెట్ కలిగి ఉన్నాయి.
ఇదే సమయంలో నోయిడా లోని ఆప్టిమస్ ఎలక్ట్రానిక్స్ ప్లాంట్ లో షియోమీ ఈ ఏడాది యాక్సెసరీలను తయారు చేసేందుకు ప్లాన్ చేసింది. మే 2023లో ఫాక్స్ కాన్ ప్రకటించిన 500 మిలియన్ల పెట్టుబడికి అదనంగా మరో 400 మిలియన్ డాలర్లను చేర్చింది.
Also Read : Revanth Reddy Police Case : ఖాకీలపై కామెంట్స్ రేవంత్ పై కేసు