Foxconn Invest : కర్ణాటకలో ఫాక్స్ కాన్ భారీ పెట్టుబడి రూ. 8,800 కోట్లు
రూ. 8,000 కోట్లతో ఇండస్ట్రియల్ ఇంటర్నెట్
Foxconn Invest : ప్రముఖ దిగ్గజ కంపెనీ ఫాక్స్ కాన్ కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు భారత దేశంలోని కర్ణాటకపై ఎక్కువగా ఫోకస్ పెట్టింది. ఇప్పటికే అమెరికాకు చెందిన ఐ ఫోన్ లకు విడి భాగాలను తయారు చేసి ఇస్తోంది ఫాక్స్ కాన్. తాజాగా ఫాక్స్ కాన్ కంపెనీ చీఫ్ కర్ణాటకను సందర్శించారు. ఈ సందర్బంగా ఇటీవలే రాష్ట్రంలో కొలువు తీరిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంతో భేటీ అయ్యారు. ఇందులో భాగంగా సీఎం సిద్దరామయ్య, ఐటీ , హోం శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గే తో ముచ్చటించారు.
Foxconn Investment
సంచలన ప్రకటన చేశారు. కర్ణాటకలో ఫాక్స్ కాన్ ఇండస్ట్రియల్ ఇంటర్నెట్ (ఎఫ్ఐఐ) ని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇందుకు గాను పెట్టుబడి కింద రూ. 8,800 కోట్లు ఖర్చు చేయనున్నట్లు స్పష్టం చేశారు.
గత కొంత కాలం నుంచి ఐ ఫోన్ తయారీదారుకు ఫాక్స్ కాన్(Foxconn) అనుబంధ సంస్థగా ఉంది. కర్ణాటక లోని తుమకూరులో సప్లిమెంటరీ ప్లాంట్ ను ఏర్పాటు చేయాలని డిసైడ్ అయ్యింది. దీని వల్ల 14,000 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కనున్నాయని ఫాక్స్ కంపెనీ వెల్లడించింది. కాగా ఈ ప్రాజెక్టు దేవనహళ్లి అసెంబ్లీ యూనిట్ తో కలిసి పని చేసే ఐ ఫోన్ ల కోసం స్క్రీన్ లు , ఔటర్ కవరింగ్ లు, మెకానికల్ భాగాలను తయారు చేస్తుంది.
Also Read : Nara Lokesh : జనం నమ్మకం కోల్పోయిన జగన్