France Fans Angry : ఫ్రాన్స్ అపజయం వెల్లువెత్తిన ఆగ్రహం
అభిమానుల వీరంగం..పోలీసుల ఫైర్
France Fans Angry : ఖతర్ వేదికగా జరిగిన ఫిఫా వరల్డ్ కప్ 2022 ఫైనల్ లో మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనా ఫ్రాన్స్ ను 4-2 తేడాతో ఓడించి విజేతగా నిలిచింది. దీంతో ఫ్రాన్స్ 2 గోల్స్ తేడాతో ఓడి పోవడంతో ఫుట్ బాల్ ప్రేమికులు, అభిమానులు వీరంగం సృష్టించారు. అల్లర్లకు పాల్పడ్డారు. పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి న్యూసెన్స్ క్రియేట్ చేశారు.
ఒకానొక దశలో ఫ్రాన్స్ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ అభిమానులను శాంతించమని కోరారు. అంత పెద్ద స్థాయిలో అల్లర్లు చోటు చేసుకున్నాయి. పోలీసులు రంగంలోకి దిగారు. భారీగా గుమి గూడిన అభిమానులను(France Fans Angry) చెదరొగొట్టేందుకు నానా తంటాలు పడ్డారు. ఎంతకూ వినిపించక పోవడంతో భాష్ప వాయువులు, వాటర్ క్యానన్లు ప్రయోగించాల్సి వచ్చింది.
దేశ రాజధాని పారిస్ అట్టుడుకుతోంది. వేలాది మంది అభిమానులు ఆటగాళ్లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వాహనాలను ధ్వంసం చేశారు. కేపిటల్ సిటీతో పాటు దేశంలోని ప్రధాన నగరాలలో సైతం ఇదే పరిస్థితి నెలకొంది. అంతే కాకుండా నైస్ లోని లియోన్ లో కూడా విధ్వంసం పెచ్చరిల్లింది. అభిమానులు ఆగ్రహంతో ఊగి పోయారు.
పరిస్థితి పూర్తిగా కంట్రోల్ తప్పడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో టియర్ గ్యాస్ , వాటర్ క్యానన్లను ప్రయోగించాల్సి వచ్చిందని ఫ్రాన్స్ పోలీసు ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ఇప్పటికే 14,000 వేల మంది పోలీసులు మోహరించారు. భద్రతా ఏర్పాట్లను చూస్తున్నారు. ఈ ఆవేశం ఇప్పట్లో చల్లారేలా లేదు. మరో వైపు ఫ్రాన్స్ పై ఘన విజయం సాధించిన అర్జెంటీనాలో సంబురాలు అంబరాన్ని అంటాయి.
Also Read : ఫిఫా వరల్డ్ కప్ లో అవార్డులు విజేతలు