Free Wi-Fi: 6,115 రైల్వే స్టేషన్లలో ఉచిత Wi-Fi !

6,115 రైల్వే స్టేషన్లలో ఉచిత Wi-Fi !

Free Wi-Fi : భారత ప్రభుత్వం చేపట్టిన డిజిటల్‌ ఇండియా కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు భారత రైల్వేశాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 6,115 రైల్వే స్టేషన్లలో ప్రయాణికులకు మరింత వేగవంతమైన హైస్పీడ్‌ వై-ఫై (Wi-Fi) సౌకర్యం కల్పిస్తున్నట్లు రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్‌ ప్రకటించారు. న్యూదిల్లీ, అహ్మదాబాద్‌, ముంబయి, కాచిగూడ, సికింద్రాబాద్‌ మొదలైన 6,115 రైల్వే స్టేషన్లలో సహా ఈ సేవలు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. రైల్వే సౌకర్యాలపై రాజ్యసభలో ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు లిఖిత పూర్వక సమాధానంలో ఆయన ఈ విషయాలు వెల్లడించారు.

ఈ వై-ఫై సదుపాయంతో ప్రయాణికులు సినిమాలు, పాటలు, గేమ్స్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని.. అత్యవసరమైన సమయాల్లో స్టేషన్‌ పరిసరాల్లో ఆఫీస్‌ వర్క్‌ కూడా చేసుకోవచ్చని అన్నారు. రైల్వే సహకార సంస్థ ‘రైల్‌టెల్‌’ సహకారంతో దీనిని అందిస్తున్నట్లు తెలిపారు ప్రయాణికులకు సౌకర్యవంతమైన సదుపాయాలు అందించడంలో భాగంగా ఈ చర్యలు తీసుకున్నామన్నారు.

Free Wi-Fi – రైల్వే స్టేషన్లలో ఉచిత Wi-Fiని ఎలా పొందాలి ?

స్మార్ట్‌ఫోన్‌లలో ముందుగా వైఫై మోడ్‌ను ఆన్‌ చేయాలి
ఆప్షన్‌లలో RailWire Wi-Fi నెట్‌వర్క్‌ను ఎంచుకోవాలి
అందులో ఫోన్‌ నెంబర్‌ను ఎంటర్‌ చేయాలి
SMS ద్వారా ఫోన్‌కు వన్-టైమ్ పాస్‌వర్డ్ (OTP) వస్తుంది
ఫోన్‌కు వచ్చిన ఓటీపీని నమోదు చేస్తే హై స్పీడ్ Wi-Fi కనెక్ట్‌ అవుతుంది.

Also Read : AP Government: ఏపీలో మహిళలకు ఉచిత బస్సు స్త్రీ శక్తి పథకం జీవో జారీ చేసిన ప్రభుత్వం

Leave A Reply

Your Email Id will not be published!