PM Narendra Modi : ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికిన ఫ్రాన్స్ అధ్యక్షుడు

Narendra Modi : ప్రధాని నరేంద్ర మోదీకి ఫ్రాన్స్‌లో ఘన స్వాగతం లభించింది. ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ “వెల్ కం టూ మై ఫ్రెండ్ మోదీ” అంటూ స్వాగతం పలికారు.

ఈ క్రమంలో పారిస్‌లో జరుగుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సమ్మిట్ మూడో ఎడిషన్‌కు మోదీ(Narendra Modi) సహ అధ్యక్షత వహించనున్నారు. ఈ సమ్మిట్‌లో ప్రధానంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అణుశక్తి సహా ఇతర ఆధునిక సాంకేతికతలపై చర్చలు జరగనున్నాయి.

PM Narendra Modi Got Grand Welcome

ఈ సమ్మిట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏఐ టెక్నాలజీ సీఈఓలు సహా పలువురు నాయకులకి కీలక వేదికగా మారింది. దీంతోపాటు భారత్, ఫ్రాన్స్ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై ప్రధాని మోదీ, ఫ్రెంచ్ అధ్యక్షుడితో కలిసి చర్చించనున్నారు. ఈ చర్చల్లో ప్రధానంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న AI సాంకేతికతను సురక్షితంగా అభివృద్ధి చేయడంపై ఫోకస్ చేయనున్నారు.

అలాగే ఈ సమ్మిట్ యూకే, దక్షిణ కొరియా వంటి దేశాల్లో గతంలో జరిగిన AI సమ్మిట్లలో కొనసాగుతున్న ఆవిష్కరణలపై మరింతగా చర్చిస్తారు. ఈ AI సమ్మిట్ కేవలం సాంకేతికతపై మాత్రమే ఫోకస్ చేయకుండా, అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న AI రంగంలోని సవాళ్లు, అవకాశాల గురించి కూడా చర్చించేందుకు వేదికగా ఉంటుంది.

ఈ శిఖరాగ్ర సమావేశంలో ప్రధానంగా AI నైతిక, బాధ్యతాయుతమైన వినియోగంపై చర్చిస్తారు. ఈ సమ్మిట్‌లో భాగంగా ప్రధానమంత్రి మోదీ.. ఏఐ టెక్నాలజీ భవిష్యత్తులో అందించే అవకాశాలపై ప్రపంచ నాయకులతో కలిసి చర్చించనున్నారు.

ప్రధాని మోదీ, ఫ్రెంచ్ అధ్యక్షుడు మాక్రాన్ ఇద్దరూ కూడా CEOల ఫోరంలో ప్రసంగిస్తారు. ఈ ఫోరం భారతదేశం, ఫ్రాన్స్ వ్యాపార రంగం మధ్య అనుసంధానాన్ని మరింత బలపరుస్తుంది. ప్రపంచ నాయకులు, టెక్నాలజీ CEOల సమావేశానికి సహ అధ్యక్షత వహించడం గౌరవంగా ఉందని ఈ సందర్భంగా ప్రధాని మోదీ అన్నారు.

Also Read : CM Chandrababu : వాట్సాప్ గవర్నెన్స్ లో అధికారుల జాప్యంపై సీఎం సీరియస్

Leave A Reply

Your Email Id will not be published!