G kishan Reddy : ముస్లిం రిజ‌ర్వేష‌న్లు ర‌ద్దు చేస్తాం

బీజేపీ చీఫ్ గంగాపురం కిష‌న్ రెడ్డి

G kishan Reddy : హైద‌రాబాద్ – కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ స్టేట్ చీఫ్ జి. కిష‌న్ రెడ్డి సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ఆయ‌న ముస్లింల‌పై నిప్పులు చెరిగారు. గ‌త ప్ర‌భుత్వం అమ‌లు చేసిన ముస్లిం రిజ‌ర్వేష‌న్ సౌక‌ర్యాన్ని ర‌ద్దు చేస్తామ‌ని ప్ర‌క‌టించారు.

G kishan Reddy Comments Viral

తాము అధికారంలోకి రావ‌డం ఖాయ‌మ‌ని, వ‌చ్చిన వెంట‌నే రిజ‌ర్వేష‌న్ ర‌ద్దుపైనే సంత‌కం చేస్తామ‌ని అన్నారు. కేంద్ర మంత్రిగా దేశంలోని అన్ని వ‌ర్గాల‌కు ప్రాతినిధ్యం వ‌హించాల్సిన కిష‌న్ రెడ్డి(G kishan Reddy) కేవ‌లం ఒక వ‌ర్గాన్ని కావాల‌ని కించ ప‌రిచేలా మాట్లాడ‌టం క‌ల‌క‌లం రేపింది.

భార‌త రాజ్యాంగం అన్ని వ‌ర్గాల‌కు స‌ముచిత స్థానం క‌ల్పించింది. దామాషా ప్ర‌కారం రిజ‌ర్వేష‌న్ సౌక‌ర్యం క‌ల్పించాల‌ని కోరింది. ఆ వ‌ర్గాలు ఎప్పుడైతే సామాజికంగా, ఆర్థికంగా, రాజ‌కీయంగా, విద్యా, ఆరోగ్య ప‌రంగా స‌ముచిత స్థానం చేరుకునేందుకు ఈ రిజ‌ర్వేష‌న్ల సౌక‌ర్యం అందుబాటు లోకి వ‌స్తుంద‌ని స్ప‌ష్టంగా పేర్కొన్నారు రాజ్యాంగంలో.

దీనిని ఏ మాత్రం గౌర‌వించ‌డం లేదు కేంద్రంలో కొలువు తీరిన మోదీ, బీజేపీ, సంకీర్ణ స‌ర్కార్. ఇక రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ త‌రుణంలో ఇలాంటి మ‌త విద్వేష పూరిత కామెంట్స్ చేయ‌డం మంచి ప‌ద్ద‌తి కాద‌ని మైనార్టీ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి.

Also Read : P Chandrasekhar : బీజేపీకి గుడ్ బై బీఆర్ఎస్ కు జై

Leave A Reply

Your Email Id will not be published!