G Kishan Reddy : మజ్లిస్ ను పెంచి పోషించింది కాంగ్రెస్సే
బీజేపీ స్టేట్ చీఫ్ గంగాపురం కిషన్ రెడ్డి
G Kishan Reddy : హైదరాబాద్ – బీజేపీ స్టేట్ చీఫ్ , కేంద్ర మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేశారు. రాష్ట్రంలో మతం ప్రాతిపదికన మజ్లిస్ పార్టీని పెంచి పోషించింది మీరేనంటూ సంచలన ఆరోపణలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
G Kishan Reddy Comments Viral
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాబోతోందని జోష్యం చెప్పారు. తమకు 60కి పైగా సీట్లు వస్తాయని అన్నారు కిషన్ రెడ్డి(G Kishan Reddy). ఈసారి అన్ని పార్టీలకు షాక్ ఇచ్చేది తామేనని అన్నారు. మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా విస్తృతంగా రాష్ట్రంలో పర్యటించారని భారీ ఎత్తున ఆదరణ లభించిందని తెలిపారు. కమలం జోష్ ను అడ్డుకునే సత్తా ఏ పార్టీకి లేదన్నారు.
రాష్ట్రంలో బీజేపీ వేవ్ కొనసాగుతోందని చెప్పారు. దళిత, బీసీ యువత భారతీయ జనతా పార్టీ వెనుక నిలబడ్డారని పేర్కొన్నారు. ముస్లిం ఆడబిడ్డలు తమ పార్టీని ఆదరిస్తున్నారని ఇంతకంటే ఇంకేం కావాలని అన్నారు. తాము గతంలో పాదయాత్రలు చేసిన సమయంలో మహిళలు బయటకు వచ్చే వారు కాదని కానీ ఇప్పుడు సీన్ మారిందని స్పష్టం చేశారు.
రాహుల్ , ప్రియాంక గాంధీలు రాజకీయ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, ఎవరో రాసి ఇచ్చే స్క్రిప్టు చదువుతున్నారంటూ ఎద్దేవా చేశారు కిషన్ రెడ్డి. గాంధీ కుటుంబం వల్లనే దేశం విడి పోయిందని ఆరోపించారు.
Also Read : Minister KTR : గులాబీకి 80 సీట్లు పక్కా – కేటీఆర్