G Kishan Reddy : అవాస్త‌వాలు అన్నీ అబ‌ద్దాలు – కిష‌న్ రెడ్డి

అన్నా చెల్లెళ్ల కామెంట్స్ పై కేంద్ర మంత్రి

G Kishan Reddy Kavitha : ఉన్న‌ట్టుండి కేంద్ర మంత్రి గంగాపురం కిష‌న్ రెడ్డి స్వ‌రం పెంచారు. ఆయ‌న ఎప్పుడూ రాష్ట్ర స‌ర్కార్ ను, క‌ల్వ‌కుంట్ల కుటుంబం ప‌ట్ల సాఫ్ట్ కార్న‌ర్ ఉండ‌డంపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో తాను కూడా విమ‌ర్శ‌ల జ‌డివాన కురిపించారు. గురువారం షాకింగ్ కామెంట్స్ చేశారు. ఢిల్లీ లిక్క‌ర్ స్కాంలో తీవ్ర ఆరోప‌ణ‌లు ఎదుర్కొని ఈడీ నుంచి నోటీసులు అందుకున్నారు సీఎం కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌.

త‌న సోద‌రికి ఈడీ నోటీసులు ఇవ్వ‌లేద‌ని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ నోటీసులు ఇచ్చారంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు మంత్రి కేటీఆర్. కావాల‌ని కేంద్రం బీజేపీయేత‌ర పార్టీలు, నాయ‌కుల‌ను టార్గెట్ చేస్తున్నారంటూ ఆరోపించారు ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌.

అన్నా చెల్లెళ్లు కేటీఆర్ , క‌విత చేసిన ఆరోప‌ణ‌ల‌పై నిప్పులు చెరిగారు కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి(G Kishan Reddy Kavitha). వాళ్లు మాట్లాడిన‌వ‌న్నీ అబ‌ద్దాలేనంటూ ఎద్దేవా చేశారు. నిజాలు మాట్లాడిన పాపాన పోలేద‌న్నారు. తెలంగాణ పేరుతో ప్ర‌జ‌ల‌ను మోసం చేసిన ఘ‌న‌త క‌ల్వ‌కుంట్ల కుటుంబానిద‌ని మండిప‌డ్డారు.

తెలంగాణ స‌మాజానికి ఒక ఘ‌న‌మైన చ‌రిత్ర ఉంద‌ని, కానీ క‌ల్వ‌కుంట్ల క‌విత ఉన్న ప‌రువు తీసింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. సిగ్గుతో త‌ల వంచుకునే ప‌రిస్థితికి తీసుకు వ‌చ్చారంటూ ఫైర్ అయ్యారు కేంద్ర మంత్రి. వాళ్లంత‌కు వాళ్లే కేసుల్లో ఇరుక్కుంటే ప్ర‌ధాన మంత్రికి, బీజేపీకి ఏం సంబంధం అంటూ ప్ర‌శ్నించారు కిష‌న్ రెడ్డి(G Kishan Reddy). లిక్క‌ర్ పాల‌సీలోకి ఎవ‌రు త‌ల‌దూర్చార‌ని, ఎవ‌రు ప్ర‌త్యేక విమానాల్లో వెళ్లారో చెప్పాల‌ని డిమాండ్ చేశారు.

Also Read : ఈడీ వ‌చ్చినా స‌రే న‌న్ను ర‌మ్మ‌న్నా ఓకే

Leave A Reply

Your Email Id will not be published!