G Kishan Reddy : అవిశ్వాస తీర్మానం ఓ నాట‌కం

బీజేపీ చీఫ్ జి. కిష‌న్ రెడ్డి కామెంట్స్

G Kishan Reddy : మ‌ణిపూర్ విష‌యంలో కేంద్ర స‌ర్కార్ పై పార్ల‌మెంట్ లో 26 పార్టీల‌కు చెందిన విప‌క్షాల కూట‌మి ఇండియా అవిశ్వాస తీర్మానం ప్ర‌వేశ పెట్టాయి. మొద‌ట బీఆర్ఎస్ ప్ర‌తిపాదించింది. దాంతో పాటు కాంగ్రెస్ పార్టీ సైతం నోటీసు అందించింది. ఇదిలా ఉండ‌గా పార్ల‌మెంట్ చ‌ట్టం ప్ర‌కారం అవిశ్వాస తీర్మానం పై నోటీసు ఇవ్వాలంటే ప్ర‌తిపాదించిన పార్టీకి క‌నీసం 50 మంది ఎంపీల మ‌ద్ద‌తు ఉండాలి. బీఆర్ఎస్ కు కేవ‌లం 9 మంది ఎంపీలు మాత్ర‌మే ఉన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ మంది పార్ల‌మెంట్ స‌భ్యులు క‌లిగి ఉండ‌డంతో స్పీంక‌ర్ ఓం బిర్లా అవిశ్వాస తీర్మానంపై అనుమ‌తి ఇచ్చారు.

G Kishan Reddy Said

దీనిపై తీవ్రంగా స్పందించారు కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ గంగాపురం కిష‌న్ రెడ్డి(G Kishan Reddy). విప‌క్షాల‌పై నిప్పులు చెరిగారు బీజేపీ చీఫ్‌. అవిశ్వాస తీర్మానం పేరుతో నాట‌కాలు ఆడుతున్నాయంటూ ధ్వ‌జ‌మెత్తారు కిష‌న్ రెడ్డి. విద్యావంతులు, మేధావులు గుర్తించాల‌ని అన్నారు. బుధ‌వారం పార్టీ కార్యాల‌యంలో బీజేపీ చీఫ్ మీడియాతో మాట్లాడారు. ఒకే దేశం ఒకే ఎరువులు నినాదంతో దేశ వ్యాప్తంగా రైతులంద‌రికీ అందుబాటులో ఎరువులు ఉండేలా చ‌ర్య‌లు చేప‌ట్ట‌డం జ‌రిగింద‌న్నారు.

ఇదే స‌మ‌యంలో ఆయ‌న చేసిన కామెంట్స్ కూడా క‌ల‌క‌లం రేపాయి. తానెందుకు మ‌ణిపూర్ పై స్పందిస్తానంటూ పేర్కొన‌డం విస్తు పోయేలా చేసింది. క‌నీస అవ‌గాహ‌న లేకుండా మాట్లాడిన మంత్రిని బీజేపీ స్టేట్ చీఫ్ ఎలా చేస్తారంటూ ప్ర‌శ్నించారు కొంద‌రు.

Also Read : MS Swaminathan : సాగు రంగానికి స్వామినాథ‌న్ స్పూర్తి

 

Leave A Reply

Your Email Id will not be published!