Gaddam Vivek : హస్తం వైపు ‘గడ్డం’ చూపు
కాంగ్రెస్ కండువా కప్పుకోనున్న వివేక్
Gaddam Vivek : మాజీ ఎంపీ , భారతీయ జనతా పార్టీ కేంద్ర కార్యవర్గ సభ్యుడు, వీ6 న్యూస్ ఛానల్, వీ6 వెలుగు పత్రిక , విశాఖ ఇండస్ట్రీస్ ఓనర్ గడ్డం వివేక్ కాషాయాన్ని వీడనున్నారు. ఈ మేరకు ఆయన స్వంత గూటికి చేరాలని నిర్ణయించికున్నట్లు టాక్.
Gaddam Vivek May be Join in Congress
గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు గడ్డం వివేక్. ఆయన తండ్రి ఇదే పార్టీలో కొనసాగారు. ఇప్పటికే గడ్డం వివేక్(Gaddam Vivek) ఎక్కడా ఒక చోట కుదురుగా ఉండరన్న అపవాదును ఎదుర్కొన్నారు. కాంగ్రెస్ నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలోకి జంప్ అయ్యారు.
ఆ పార్టీలో పొసగక కేసీఆర్ ను తిట్టుకుంటూ భారతీయ జనతా పార్టీలో చేరారు. తిరిగి స్వంత గూడు కాంగ్రెస్ పార్టీ వైపు చూడడం విస్తు పోయేలా చేసింది. త్వరలో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నుంచి సీనియర్ నేతలు కాంగ్రెస్ వైపు చూస్తున్నట్లు సమాచారం.
ఇతర పార్టీల నుండి కమల కండువా కప్పుకున్న వారిలో చాలా మంది అసంతృప్తితో ఉన్నట్లు టాక్. ముందు నుంచి పార్టీలో ఉన్న వారికి తాజాగా బయటి నుంచి వచ్చి చేరిన వారికి మధ్య పొసగడం లేదు. ఇదే సమయంలో మాజీ మంత్రి కె. చంద్రశేఖర్ బీజేపీకి గుడ్ బై చెప్పారు. ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
Also Read : Ayutha Chandi Yagam : భక్తుల నివేదన లక్ష కుంకుమార్చన