Gade Innaiah : గాదె ఇన్నయ్యపై సీఎం ఫోకస్ ..?
ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ పోస్ట్
Gade Innaiah : హైదరాబాద్ – తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన మేధావులు, కవులు, కళాకారులు, రచయితలు , బుద్ది జీవులకు , ప్రొఫెసర్లు, ఆలోచనాపరులకు పెద్దపీట వేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్రలు పోషించిన జేఏసీ చైర్మన్ , తెలంగాణ జన సమితి పార్టీ చీఫ్ కోదండరాంకు ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా , విద్యా, ఖాళీల భర్తీకి సంబంధించి సలహాదారుగా మాజీ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఆకునూరి మురళికి బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం.
Gade Innaiah CM Revanth Reddy Focus on Him
మరో వైపు నక్సలైట్ ఉద్యమానికి వెన్ను దన్నుగా ఉంటూ ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు నిలదీస్తూ వచ్చి, అరెస్ట్ అయి, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ వచ్చిన గాదె ఇన్నయ్యకు కీలకమైన పోస్టు అప్పగించనున్నారని టాక్. తెలంగాణ ప్రణాళిక బోర్డు ఉపాధ్యక్షుడిగా ఎంపిక పూర్తిగా ఖరారైందని, ఇక ప్రకటించడమే మిగిలి ఉందని విశ్వసనీయ సమాచారం.
ప్రభుత్వ పరంగా కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు రేవంత్ రెడ్డి(Revanth Reddy). పలువురు సీనియర్ ఆఫీసర్లు, కలెక్టర్లు, ఎస్పీలకు స్థాన చలనం కలగనుంది. దీంతో పెద్ద ఎత్తున బదిలీలు ఉండ బోతున్నాయి.
Also Read : Akunuri Murali : ప్రభుత్వ సలహాదారుగా ఆకునూరి..?