Gandhis Skip : ప్లీనరీ సమావేశానికి ‘గాంధీలు’ దూరం
రాయ్ పూర్ లో కీలక మీటింగ్ స్టార్ట్
Gandhis Skip Plenary Meet : కాంగ్రెస్ పార్టీ కీలక ప్రకటన చేసింది. ఛత్తీస్ గఢ్ రాజధాని రాయ్ పూర్ లో ఫిబ్రవరి 24 శుక్రవారం నుంచి 25, 26 తేదీలలో మూడు రోజుల పాటు కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఈ మీటింగ్ రోడ్ మ్యాప్ సిద్దం చేయనుంది.
దీంతో దేశ వ్యాప్తంగా పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు, కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న వారంతా ప్లీనరీకి హాజరవుతున్నారు. ఇదిలా ఉండగా ఈ ముఖ్యమైన పార్టీ సమావేశానికి గాంధీ ఫ్యామిలీకి(Gandhis Skip Plenary Meet) చెందిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ హాజరు కావడం లేదని పార్టీ ఇవాళ వెల్లడించింది.
ఆక్టోపస్ లా విస్తరించిన భారతీయ జనతా పార్టీని ఢీకొనడం, ప్రతిపక్షాలతో కలిసి ముందుకు సాగడంపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టనున్నట్లు సమాచారం. కీలకమైన నేతలు పార్టీకి దూరం కావడంపై కూడా చర్చ జరగనుంది. మొదటి గవర్నర్ జనరల్ సి. రాజగోపాలాచారి ముని మనుడు సీఆర్ కేశవన్ పార్టీకి గుడ్ బై చెప్పారు.
గతంలో ఉన్న విలువలు ప్రస్తుతం పార్టీలో కనిపించడం లేదని చేసిన కామెంట్స్ కలకలం రేపాయి. మరో వైపు పార్టీ సీనియర్ నాయకుడు, మీడియా సెల్ హెడ్ పవన్ ఖేరా అరెస్ట్ వ్యవహారం తీవ్ర దుమారం రేపింది. మొత్తంగా ఇటీవల రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కొంత మేరకు పార్టీని కాపాడిందనే చెప్పక తప్పదు.
ప్రస్తుతం రాయ్ పూర్ లో 85వ ప్లీనరీ సమావేశం ఇది. వర్కింగ్ కమిటీ ఎన్నికలపై కూడా చర్చించనున్నట్లు సమాచారం.
Also Read : ఉక్రెయిన్ పై ఓటింగ్ కు భారత్ దూరం