Gang Rape: ఢిల్లీలో 24 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారం

ఢిల్లీలో 24 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారం

Gang Rape : పంద్రాగస్టు వేడుకలకు సన్నాహాలు జరుగుతున్న తరుణంలో దేశ రాజధాని ఢిల్లీ మరో ఘోరం చోటుచేసుకుంది. ఢిల్లీలోని (Delhi) తిలక్ నగర్‌ కు చెందిన 24 ఏళ్ల మహిళపై సామూహిక అత్యాచారం (Gang Rape) జరిగింది. ఉత్తర ఢిల్లీలోని సివిల్ లైన్స్ ప్రాంతంలో ఈ ఘోరం చోటుచేసుకుంది. మహిళపై కొంతమంది వ్యక్తులు సామూహిక అత్యాచారం చేశారని పోలీసులు తెలిపారు. ఆదివారం రాత్రి బాధితురాలిని స్నేహితుడి ఇంట్లో జరిగిన పార్టీకి ఆహ్వానించి ఈ దుర్మార్గానికి ఒడిగట్టునట్టు తెలుస్తోంది. బాధితురాలు తన సోదరితో కలిసి పార్టీకి వెళ్లింది. అయితే, ఈ దారుణం జరిగిన 13-14 గంటల తర్వాత ఘటన గురించి తమకు ఫిర్యాదు చేసిందని పోలీసులు తెలిపారు. గురుగ్రామ్‌లోని ఒక సంస్థలో పనిచేస్తున్న బాధితురాలు తాను పార్టీలో మద్యం సేవించిన తర్వాత నలుగురు యువకులు తనపై అత్యాచారం జరిపారని ఫిర్యాదు చేసారని పోలీసులు తెలిపారు.

Gang Rape in Delhi

ప్రస్తుతం పోలీసులు ఈ కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, బాధితురాలు పార్టీ ప్రాంతానికి చేరుకునేసరికి ఆమె స్నేహితుడితో పాటు మరో నలుగురు పురుషులు ఆ ఇంట్లో ఉన్నారని బాధితురాలు చెబుతోంది… ఆమెకు ఇచ్చిన డ్రింక్ లో ఏదో కలిపినందున ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిందని పోలీసులు అంటున్నారు. ఆ తర్వాత ఆ గ్యాంగ్.. ఆమెను బాత్రూంలోకి తీసుకెళ్లారని, అక్కడ ఆ వ్యక్తులు ఆమెపై సామూహిక అత్యాచారం చేసి, అదంతా వీడియో తీశారని ఆమె పోలీసులకు తెలిపింది.

దీని గురించి ఎవరికైనా చెబితే, వీడియోను సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తామని నిందితుడు బెదిరించినట్లు తెలుస్తోంది. అనంతరం బాధితురాలిని ఆమె ఇంటి బయట వదిలేశారని పోలీసులు తెలిపారు. సోమవారం ఆమె సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేసింది. ఆమె వాంగ్మూలం నమోదు చేసి వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత, ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ప్రస్తుతం పోలీసులు నిందితులను ప్రస్తుతం గుర్తించే పనిలో ఉన్నారు. వారిని గుర్తించడానికి సిసిటివి ఫుటేజ్‌లను విశ్లేషిస్తున్నారు. తరువాత బాధితురాలి తల్లిదండ్రులకు సమాచారం అందించామని, ఆమెకు కౌన్సెలింగ్ ఇచ్చారని పోలీసులు వివరించారు. ఆమె ఫిర్యాదు ఆధారంగా పోలీసులు అత్యాచారం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Also Read : Supreme Court: వీధి కుక్కల తీర్పుపై సుప్రీం కోర్టు యూటర్న్‌ ?

Leave A Reply

Your Email Id will not be published!