Ganga River Pollution: కాలుష్య కోరల్లో గంగా నది ! స్నానానికి కూడా పనికిరాని నీరు!
కాలుష్య కోరల్లో గంగా నది ! స్నానానికి కూడా పనికిరాని నీరు!
Ganga River : భారతీయులు అత్యంత పవిత్రంగా భావించే గంగానది కాలుష్య కోరల్లో చిక్కుకుని కొట్టుమిట్టాడుతోంది. ఇదే విషయాన్ని బిహార్ కాలుష్య నియంత్రణ మండలి(బిఎస్ పీసీబీ) తన నివేదికలో స్పష్టం చేసింది. బిహార్ లోని గంగా నది ప్రవహించే 34 చోట్ల పక్షం రోజులకొకసారి నిర్వహించిన నీటి నాణ్యత పరీక్షల్లో అధిక స్థాయిలో బ్యాక్టీరియాలు (టోటల్ కోలిఫాం, ఫీకల్ కోలిఫాం) ఉన్నట్లు పరిశీలనలో తేలిందని పేర్కొంది. దీనితో కాలుష్యం కారణంగా బిహార్ లోని అనేక చోట్ల గంగా నది నీరు స్నానానికి పనికి రాదని రాష్ట్ర అసెంబ్లీలో ఇటీవల ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే 2024-25 వెల్లడించింది.
గంగా నది(Ganga River), దాని ఉపనదుల ఒడ్డున ఉండే పట్టణాల నుంచి మురుగునీరు, ఇళ్ల నుంచి వచ్చి కలిసే వ్యర్థ నీటి కారణంగా బ్యాక్టీరియా అధిక మొత్తంలో చేరిందని సర్వే పేర్కొంది. ఇదే సమయంలో గంగా, దాని ఉపనదుల్లో పీహెచ్, డిజాల్వ్డ్ ఆక్సిజన్, బయో-కెమికల్ ఆక్సిజన్ డిమాండ్(బీవోడీ) వంటి ఇతర పారామితులు పరిమితి స్థాయిలో ఉన్నాయని, ఈ నీరు జల జీవరాశులకు, చేపల పెంపకానికి, వ్యవసాయానికి సరిపోతుందని తెలిపింది.
Ganga River Pollution
ఈ సందర్భంగా బీఎస్ పీసీబీ చైర్మన్ శుక్లా మాట్లాడుతూ… మలంలో ఈ ఫీకల్ కోలిఫాం బ్యాక్టీరియా ఉంటుందని చెప్పారు. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రమాణాల కన్నా గంగా నదిలో చాలా చోట్ల ఫీకల్ కోలిఫాం పరిమితి మించిపోయిందని… దీనితో ఆ నీరు స్నానానికి పనికిరాదని పేర్కొన్నారు. నదిలోకి వచ్చే నీటి శుద్ధికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. అయితే కేవలం బీహార్ లో మాత్రమే గంగా నది కలుషితం అయింది. మిగిలిన రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాలు తీసుకున్న చర్యల వలన సాధారణ స్థాయిలోనే కాలుష్యం ఉందని తెలుస్తోంది. అయితే ఇటీవల ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళాలో 40 కోట్ల మందికి పైగా పుణ్య స్నానాలు ఆచరించినప్పటికీ నదిలో నీటి కాలుష్యం ఈ స్థాయిలో లేకపోవడం గమనార్హం.
Also Read : PM Narendra Modi: సోమనాథ్ ఆలయంలో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు