Asad Ahmed Encounter : గ్యాంగ్ స్టర్ అసద్ ఎన్ కౌంటర్
కాల్చి చంపిన యూపీ పోలీసులు
Asad Ahmed Encounter : యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ చెప్పినట్టే నేరస్థుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. యూపీలో నేరస్థులకు కళ్లెం వేసే పనిలో పడ్డారు. ఇప్పటికే సమాజ్ వాదీ పార్టీకి చెందిన మాజీ ఎంపీ అతిక్ అహ్మద్ ను జైల్లోకి నెట్టింది యూపీ సర్కార్. అతడిపై ఇప్పటి దాకా 100 కేసులు నమోదయ్యాయి. కానీ ఇప్పటి వరకు అరెస్ట్ కాలేదు. చివరకు బీజేపీ ప్రభుత్వం వచ్చాక గ్యాంగ్ స్టర్లకు భయం మొదలైంది.
తాజాగా జైల్లోనే ఉన్న గ్యాంగ్ స్టర్ అతిక్ అహ్మద్ కొడుకును యూపీ పోలీసులు ఎన్ కౌంటర్(Asad Ahmed Encounter) లో కాల్చి చంపారు. ఉత్తర ప్రదేశ్ లోని ఝాన్సీ వద్ద జరిగింది ఈ ఎన్ కౌంటర్. అతిక్ కుమారుడితో పాటు మరో ఇద్దరిని కూడా కాల్చినట్లు సమాచారం. ఫిబ్రవరి 24న ప్రయాగ్ రాజ్ ఇంటి బయట కాల్చి చంపిన ఉమేష్ పాల్ హత్య కేసులో అసద్ అహ్మద్ , గులాం నిందితులుగా ఉన్నారు. 2005లో బీఎస్పీ ఎమ్మెల్యే రాజు పాల్ హత్య కేసులో న్యాయవాది సాక్షి, శాసనసభ్యుడి హత్య కేసులో అతిక్ అహ్మద్ నిందితుడు.
ఉమేష్ పాల్ పై పగటి పూట జరిగిన దాడికి సంబంధించిన షాకింగ్ విజువల్స్ , అతడికి రక్షణగా ఉన్న భద్రతా సిబ్బంది ప్రాణాలు కూడా కోల్పోయారు. యూపీ శాంతి భద్రతలపై పరిస్థితిపై పెద్ద ప్రశ్నలను లేవదీసింది.
ఉమేష్ పాల్‌పై పగటిపూట జరిగిన దాడికి సంబంధించిన షాకింగ్ విజువల్స్, అతనికి రక్షణగా ఉన్న భద్రతా సిబ్బంది ప్రాణాలను కూడా బలిగొన్నాయి, ఉత్తరప్రదేశ్ శాంతిభద్రతల పరిస్థితిపై పెద్ద ప్రశ్నలను లేవనెత్తింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం యూపీ స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీంపై కాల్పులు జరపడంతో అసద్ , గులాంలను కాల్చి చంపారు. అత్యాధునిక ఆయుధాలు, సెల్ ఫోన్లు, సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు.
Also Read : కాశ్మీర్ లోని రాజౌరిలో డ్రోన్ కూల్చివేత