Gaurav Bhatia : కేజ్రీవాల్ మామూలోడు కాదు
నిప్పులు చెరిగిన గౌరవ్ భాటియా
Gaurav Bhatia : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Delhi CM) కు కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ సమన్లు జారీ చేసింది. ఈనెల 16న ఉదయం 11 గంటలకు హాజరు కావాలని ఆదేశించింది. దీనికి సంబంధించి సీఎం కేజ్రీవాల్ షాకింగ్ కామెంట్స్ చేశారు. కేంద్ర ఏజెన్సీలు కోర్టులకు అబద్దాలు చెబుతున్నాయని ఆరోపించారు. ప్రజల్ని, ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తూ వేధింపులకు పాల్పడుతున్నాయని వాపోయారు.
దీనిపై భారతీయ జనతా పార్టీ సీరియస్ గా స్పందించింది. సీఎం కేజ్రీవాల్ కు ఐదు ప్రశ్నలు సంధించింది. సీబీఐ నోటీసులకు ఎందుకు భయపడుతున్నారంటూ ప్రశ్నించింది. బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా ఆదివారం మీడియాతో మాట్లాడారు. నిజాయితీ కలిగిన వ్యక్తి అయితే, తాను ఎలాంటి తప్పు చేయలేదని భావిస్తే ఎందుకు ఆరోపణలు చేస్తున్నారంటూ ప్రశ్నించారు.
సీఎంపై ప్రశ్నల వర్షం కురిపించారు భాటియా. మద్యం వ్యాపారంతో నీకు సంబంధం ఏమిటి. మీ మద్యం పాలసీ చాలా బాగుంటే దాన్ని ఎందుకు ఉపసంహరించు కున్నారని ప్రశ్నించారు. ఈ మద్యం స్కాంకు సంబంధించిన మీటింగ్ మీ ఆధ్వర్యంలోనే జరగలేదా. అది నిజం కాదా..అలాంటప్పుడు మిమ్మల్ని ఎందుకు తప్పు పట్టకూడదని నిలదీశారు గౌరవ్ భాటియా(Gaurav Bhatia). హోల్ సేల్ ఎల్1 లైసెన్స్ ఇవ్వాలని మాజీ మంత్రి ఎక్సైజ్ కమిషనర్ ను ఎందుకు బలవంతం చేస్తారంటూ మండిపడ్డారు. కేజ్రీవాల్ మామూలోడు కాదు మోసగాడు అని ఆరోపించారు.
Also Read : దర్యాప్తు సంస్థలు వేధిస్తున్నాయి