Gautam Gambhir Visit : శ్రీవారి సేవలో గౌతమ్ గంభీర్
దర్శించుకున్న దంపతులు
Gautam Gambhir Visit : తిరుమల – పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల ను భారత క్రికెట్ జట్టు మాజీ క్రికెటర్ , భారతీయ జనతా పార్టీకి చెందిన ఎంపీ గౌతమ్ గంభీర్ తన భార్యతో కలిసి దర్శించారు. ఈ సందర్భంగా శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మలను దర్శించుకున్నారు.
Gautam Gambhir Visit Tirumala
వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో గౌతమ్ గంభీర్(Gautam Gambhir) కుటుంబీకులతో కలిసి స్వామి వారి సేవలో పాల్గొన్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఇదిలా ఉండగా గౌతమ్ గంభీర్ తిరుమలను సందర్శించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారాయి. దర్శన అనంతరం మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం భారత దేశంలో నిర్వహించే వన్డే వరల్డ్ కప్ ను గెలుచుకునే ఛాన్స్ భారత జట్టుకు ఉందని అభిప్రాయం వ్యక్తం చేశాడు.
140 కోట్ల భారతీయులతో భారత్ కచ్చితంగా గెలుస్తుందన్న నమ్మకం తనకు ఉందన్నాడు గంభీర్.
Also Read : Spiritual Book Release : వైష్ణవ భక్తగ్రేశుడు అనంతాళ్వార్