Mudragada Padmanabham: ముద్రగడ పేరు మార్పు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల !
ముద్రగడ పేరు మార్పు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల !
Mudragada Padmanabham: కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం పేరును పద్మనాభ రెడ్డిగా మార్పు చేస్తూ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పిఠాపురం అసెంబ్లీ నుండి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలిస్తే తన పేరును పద్మనాభ రెడ్డి(Mudragada Padmanabham)గా మార్చుకుంటాను అని సవాల్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పిఠాపురం అసెంబ్లీ నుండి పవన్ కళ్యాణ్ అరవై వేలకు పైగా ఓట్ల మెజారిటీతో వైసీపీ అభ్యర్ధి వంగా గీతపై గెలుపొందడమేకాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఏర్పాటులో కీలకంగా మారారు. అంతేకాదు జనసేన పోటీ చేసిన 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాల్లో కూడా గెలుపొంది… 100 శాతం స్ట్రైక్ రేట్ తో భారతదేశ రాజకీయాల్లో రికార్డు సృష్టించారు. ఈ నేపథ్యంలో ఎన్నికలకు ముందు చేసిన సవాల్ కు కట్టుబడి ఉంటూ… ఫలితాలు వెలువడిన వెంటనే… పేరు మార్పు కోసం ముద్రగడ పద్మనాభం ధరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు పేరు మార్పు చేస్తూ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
Mudragada Padmanabham Name..
1978లో జనతాపార్టీతో రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ముద్రగడ పద్మనాభం… 1983లో ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీలో చేరారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా ముద్రగడ(Mudragada Padmanabham) గెలుపొందారు.. 1999 సార్వత్రిక ఎన్నికల్లో కాకినాడ లోక్ సభ స్థానం నుండి గెలుపొందారు. టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాల్లో మంత్రిగా పనిచేసిన ముద్రగడ… కాపు ఉద్యమానికి ప్రాతినిధ్యం వహించారు. కాపులకు రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో పెద్ధ ఎత్తున ఉద్యమాన్ని చేపట్టారు. ఈ నేపథ్యంలోనే తుని రైలు దహనం కేసులో కేసులను ఎదుర్కొన్నారు. అప్పట్లో తెలుగుదేశం ప్రభుత్వం ముద్రగడ కుటుంబాన్ని తీవ్ర అవమానాలు, ఇబ్బందులకు గురిచేసిందంటూ అనేక సార్లు మీడియా ముఖంగా, బహిరంగ లేఖల ద్వారా వెల్లడించారు.
2024 ఎన్నికలకు ముందు జనసేన చేరుతారని ప్రచారం జరిగినా… వివిధ కారణాలతో వైసీపీలో చేరారు. అయితే వైసీపీలో చేరిన తరువాత… జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తీవ్రమైన ఆరోపణలు చేసారు. ఈ నేపథ్యంలో తన తండ్రి పద్మనాభం… జగన్ చేతిలో పావుగా మారారంటూ అతని కుమార్తె క్రాంతి, అల్లుడు చందు…. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిసి పార్టీలో చేరడానికి సముఖత వ్యక్తం చేసారు. అయితే తండ్రీకూతుర్లను విడదీసే మనస్తత్వం తనది కాదని… త్వరలో ముద్రగడను కలిసి అతని ఆశీస్సులతోనే మిమ్మల్ని పార్టీలోనికి చేర్చుకుంటానని తుని బహిరంగ సభ వేదికగా ఆయన సున్నితంగా తిరస్కరించారు.
Also Read : Gorantla Butchaiah Chowdary: ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణ స్వీకారం చేసిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి !