PM Modi : గీతా ప్రెస్ దేశ సంస్కృతికి ప్రతీక – మోదీ
వందేళ్లు పూర్తి చేసుకున్న
PM Modi : ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యూపీకి చెందిన గోరఖ్ పూర్ లోని గీతా ప్రెస్ కు అరుదైన ఘనత ఉందన్నారు. అపారమైన చరిత్ర ఉందని కొనియాడారు. శుక్రవారం యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ ,గవర్నర్ తో కలిసి ప్రధాన మంత్రి గీతా ప్రెస్ భవనాన్ని సందర్శించారు. సంస్థ ప్రచురించిన పుస్తకాలను పరిశీలించారు. ఇటీవలే సదరు సంస్థ 100 ఏళ్లు పూర్తి చేసుకుంది. అంతే కాదు ప్రధాన మంత్రి మోదీ అధ్యక్షత కలిగిన పురస్కారాల కమిటీ గాంధీ బహుమతిని గీతా ప్రెస్ కు ప్రకటించింది.
భారతీయ ఇతిహాసం భగవద్గీతను అతి తక్కువ ధరకే దేశ వ్యాప్తంగా పంపిణీ చేస్తూ వచ్చింది. అన్ని భాషల్లో ప్రజలకు చేరువ చేయడంలో గీతా ప్రెస్ చేసిన ప్రయత్నం గురించి ఎంత చెప్పినా తక్కువేనని కొనియాడారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(PM Modi).
ఈ ప్రచురణలు లక్షలాది మందిని ప్రభావితం చేశాయని పేర్కొన్నారు. వీటిని చదివిన వారంతా విలువలతో జీవించేందుకు ప్రయత్నం చేశారని చెప్పారు ప్రధానమంత్రి. భారత దేశ సనాతన సంస్కృతికి ప్రతీకంగా నిలిచిందని , తాను ఇందులో పాలు పంచుకోవడం ఆనందంగా ఉందన్నారు నరేంద్ర మోదీ. భారత దేశ చరిత్రలో ఒక నూతన అధ్యాయానికి పుస్తకాల ప్రచురణల్లో గీతా ప్రెస్ నిలిచిందన్నారు.
Also Read : Sanjay Raut : రాహుల్ పై కేంద్రం కక్ష రౌత్ కన్నెర్ర