Ukraine Russia : ఉక్రెయిన్ పై దాడులకు పాల్పడిన నేపథ్యంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే రష్యా ఉక్రెయిన్ ను తన చేతుల్లోకి తీసుకున్నట్లు సమాచారం.
ఈ తరుణంలో ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ తాను రష్యా అధ్యక్షుడు పుతిన్ (Ukraine Russia )తో చర్చించేందుకు సిద్దంగా ఉన్నట్లు ప్రకటించాడు. ఇప్పటికే తాము యుద్దాన్ని కోరుకోవడం లేదని స్పష్టం చేశాడు.
ఇప్పటి దాకా అమెరికాతో పాటు నాటో, యూరోప్ దేశాలు సైతం ఉక్రెయిన్ కు మద్దతుగా ఇచ్చాయి. కానీ ఏ ఒక్క దేశం కూడా ఉక్రెయిన్ కు మద్దతు ఇవ్వక పోవడంతో ఒంటరిగా మిగిలి పోయాడు జెలెన్స్కీ.
ఈ తరుణంలో ఐక్యరాజ్య సమితి, ఫ్రాన్స్, బ్రిటన్ చేసిన విన్నవించినా పట్టించు కోలేదు పుతిన్. ప్రస్తుతం జెలెన్స్కీ అండర్ గ్రౌండ్ కు వెళ్లి పోయినట్లు సమాచారం.
ఇదిలా ఉండగా ఉక్రెయిన్ ఆర్మీ పూర్తిగా లొంగి పోతే తాము చర్చలకు సిద్దంగా ఉన్నట్లు రష్యా విదేశాంగ శాఖ మంత్రి స్పష్టం చేశారు. చివరి వరకు పోరాటం చేస్తానని చెప్పాడు ప్రెసిడెంట్.
ఇదే చర్చలు ముందుగా ప్రకటించి ఉండి ఉంటే ఇంత మారణ హోమం జరిగి ఉండేది కాదు. ఆస్తి, ప్రాణ నష్టం జరిగి ఉండేది కాదు. ఉక్రెయిన్ విషయంలో అమెరికా చేసిన ప్రయత్నం ఫలించ లేదు.
మొత్తం ఈ వ్యవహారంలో అసలైన విజేతగా నిలిచింది మాత్రం రష్యా. ఆ దేశ అధ్యక్షుడు పుతిన్(Ukraine Russia )అని చెప్పక తప్పదు. ఇదే సమయంలో తమపై ఆంక్షలు విధిస్తే ఇంటర్నేషనల్ స్పేస్ ను కూడా పేల్చి వేస్తామని ప్రకటించారు.
ప్రస్తుతం ఈ ప్రకటన కలకలం రేపింది. ఉక్రెయిన్ విషయంలో ఎవరు ఉంటారనేది త్వరలో తేలనుంది.
Also Read : అంతరిక్ష కేంద్రం కూల్చేస్తాం