Ghanta Chakrapani : ఒక శకం ముగిసింది – ఘంటా చక్రపాణి
తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోశాడు
Ghanta Chakrapani : ప్రజా యుద్ద నౌక గద్దర్ మరణం తెలంగాణకు తీరని లోటు అని పేర్కొన్నారు టీఎస్పీఎస్సీ మాజీ చైర్మన్ ఘంటా చక్రపాణి(Ghanta Chakrapani). అన్ని ఉద్యమాలకు సాక్షీభూతంగా ఉన్నారని కొనియాడారు. ఒక రకంగా చెప్పాలంటే ఒక శకం ముగిసిందన్నారు ఘంటా చక్రపాణి.
Ghanta Chakrapani Tributes To Gaddar
గద్దర్ ఒక ప్రాంతానికి చెందిన వాడు కాదన్నాడు. ప్రపంచ వ్యాప్తంగా ప్రభావం చేసిన యోధుడు ఆయన అన్నాడు. ఇన్నేళ్ల పాటు బతకడానికి కారణం ప్రజల మీద ఉన్న ప్రేమ తప్ప మరొకటి కాదన్నారు. ఆయుధం అంటే ఆలోచన, ఆయుధం అంటే పాట, ఆయుధం అంటే ఓటు అని పేర్కొన్నారు ఘంటా చక్రపాణి.
ఇదిలా ఉండగా గద్దర్ కోరుకున్న విధంగా ఆయన పార్థివ దేహాన్ని ప్రస్తుతానికి హాస్పిటల్ నుంచి లాల్ బహదూర్ స్టేడియంకు తరలించారు. వేలాదిగా జనం తరలి వస్తున్నారు. గద్దర్ కోరిక మేరకు తన పార్థివ దేహాన్ని వెంకటాపురంలోని మహాబోధి స్కూల్ ఆవరణలో చివరి కార్యక్రమం ఉంటుందని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని గద్దర్ తనయుడు వెల్లడించారు.
ఇలాంటి గాయకుడు పుట్టడు. ప్రజల నాలకుల మీద నిలిచే ఉంటాడని అన్నారు. ప్రజా యుద్ద నౌకకు జోహార్ అని పేర్కొన్నారు .
Also Read : Chiranjeevi Gaddar : గద్దరన్నకు లాల్ సలాం – చిరంజీవి