Ghulam Nabi Azad : కొత్త పార్టీ పేరు ప్ర‌క‌టించిన ఆజాద్

డెమోక్ర‌టిక్ ఆజాద్ పార్టీ అని వెల్ల‌డి

Ghulam Nabi Azad : సుదీర్ఘ రాజ‌కీయ చ‌రిత్ర క‌లిగిన కేంద్ర మాజీ మంత్రి, మాజీ సీఎం గులాం న‌బీ ఆజాద్ సోమవారం కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఆయ‌న ఇప్ప‌టికే 50 ఏళ్ల అనుబంధం క‌లిగిన కాంగ్రెస్ పార్టీని వీడారు.

తాను కొత్త పార్టీ పెడ‌తాన‌ని ప్ర‌క‌టించారు. ఆ మేర‌కు పార్టీ పేరు, జెండా, ఎజెండాను తాము నిర్ణ‌యించ‌మ‌ని కేవ‌లం జ‌మ్మూ కాశ్మీర్ ప్ర‌జ‌లు నిర్ణ‌యిస్తార‌ని స్ప‌ష్టం చేశారు.

ఆ మేర‌కు గులాం న‌బీ ఆజాద్ ఇవాళ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. పార్టీకి సంబంధించిన విధి విధానాలతో కూడుకున్న కొత్త పార్టీని వెల్ల‌డించారు.

ఈ మేర‌కు డెమోక్ర‌టిక్ ఆజాద్ పార్టీ (డీఏపీ) ని స్థాపిస్తున్న‌ట్లు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు గులాం న‌బీ ఆజాద్(Ghulam Nabi Azad). ఇది కేవ‌లం ప్ర‌జ‌ల కోసం మాత్ర‌మే ప‌ని చేస్తుంద‌న్నారు.

ప్ర‌జా , రాష్ట్ర స‌మ‌స్య‌ల‌పై పోరాటం చేస్తుంద‌ని చెప్పారు. యువ‌త‌, సీనియ‌ర్లు క‌లిసి పార్టీని ముందుకు తీసుకు వెళ‌తార‌ని చెప్పారు. ఇవాళ గులాం న‌బీ ఆజాద్ మీడియాతో మాట్లాడారు.

అంత‌కు ముందు జమ్మూలో బ‌హిరంగ ర్యాలీ చేప‌ట్టారు. కాంగ్రెస్ పార్టీ నుంచి వైదొలిగిన నెల రోజుల త‌ర్వాత కొత్త పార్టీని ప్ర‌క‌టించారు. పార్టీకి సంబంధించి ఏజ్ బార్ (వ‌య‌స్సు నియంత్ర‌ణ ) అనేది ఉండ‌ద‌ని స్ప‌ష్టం చేశారు గులాం న‌బీ ఆజాద్.

కాంగ్రెస్ పార్టీతో ఉన్న 50 ఏళ్ల అనుబంధాన్ని గ‌త నెల ఆగ‌స్టు లో గుడ్ బై చెప్పారు. ఇదిలా ఉండ‌గా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. కొత్త పార్టీ పేరు ఏం పెట్టాల‌నే దానిపై అడిగాం.

ఇందు కోసం 1,500 మంది పేర్ల‌ను ఉర్దూ,సంస్కృతంలో పంపించార‌ని తెలిపారు ఆజాద్. పార్టీని రిజిస్ట‌ర్ చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.

Also Read : క‌నిష్ట స్థాయికి ప‌డి పోయిన రూపాయి

Leave A Reply

Your Email Id will not be published!