Ghulam Nabi Azad : కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు గులాం నబీ ఆజాద్ సంచలన కామెంట్స్ చేశారు. దేశ వ్యాప్తంగా వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో వచ్చిన ది కశ్మీర్ ఫైల్స్ విజయవంతంగా నడుస్తోంది. ఇప్పటికే ఎవరూ ఊహించని రీతిలో రూ. 100 కోట్లను దాటేసింది.
దేశంతో పాటు ఓవర్సీస్ లో కూడా దుమ్ము రేపుతోంది. ఎంతగా సక్సెస్ టాక్ తెచ్చుకున్నా మరో వైపు ఆ చిత్రానికి వివాదాలు కూడా అదే స్థాయిలో వెంటాడుతున్నాయి.
ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ మండిపడగా శివసేన జాతీయ అధికార ప్రతినిధి, ఎంపీ సంజయ్ రౌత్ సీరియస్ కామెంట్స్ చేశారు. అది ఒక సినిమా మాత్రమేనని కానీ జీవితం మాత్రం కాదన్నారు.
సినిమాను కూడా రాజకీయంగా వాడుకోవడంలో బీజేపీ, మోదీ మరోసారి సక్సెస్ అయ్యారంటూ ఎద్దేవా చేశారు. తాజాగా ఆజాద్ (Ghulam Nabi Azad)చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. నాతో సహా రాజకీయ పార్టీలన్నీ విభజనను సృష్టిస్తాయంటూ వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ తో పాటు వివిధ రాజకీయ పార్టీలు ఇందుకు బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. 1990 నాటి కాశ్మీరీ పండిట్ల వలసలు , హత్యలను ప్రస్తావించారు.
ఈ సందర్భంగా కాశ్మీర్ లోయలో జరిగిన అన్నింటికీ పాకిస్తాన్ , ఉగ్రవాదులే కారాణమని ఆరోపంచారు ఆజాద్. ఈ మూవీపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్న ఈ తరుణంలో గులాం నబీ ఆజాద్ చేసిన కామెంట్స్ అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
అన్ని పార్టీలనే కాదు తమ పార్టీని కూడా విస్మరించాల్సిన పని లేదన్నాడు. ప్రజలంతా కలిసి ఉండాలని కోరారు ఆజాద్.
Also Read : ది కశ్మీర్ ఫైల్స్ పై ప్రకాశ్ రాజ్ ఫైర్