Amit Shah Bengal : బీజేపీకి 35 సీట్లిస్తే దీదీ సర్కార్ క్లోజ్
అమిత్ షా షాకింగ్ కామెంట్స్
Amit Shah Bengal : కేంద్ర హొం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా కామెంట్స్ చేశారు. తమ పార్టీకి రాబోయే ఎన్నికల్లో 35 సీట్లు గెలిపిస్తే ఇక పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని ప్రభుత్వం ఉండదన్నారు. పదవి ఉందని అహంకారంతో విర్రవీగుతున్న సీఎం మమతా బెనర్జీ ఆట కట్టిస్తామని, ఇక రాష్ట్రంలో కాషాయ జెండా ఎగుర వేస్తామని ప్రకటించారు.
ప్రస్తుతం అమిత్ షా చేసిన కామెంట్స్ (Amit Shah Bengal) కలకలం రేపుతున్నాయి. దీనిపై టీఎంసీ భగ్గుమంది. కూల్చడం బీజేపీ నైజం అయితే అడ్డుకోవడం తమ లక్ష్యమన్నారు టీఎంసీ నేతలు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో మొత్తం 42 లోక్ సభ స్థానాలు ఉన్నాయి. ఇందులో 35 స్థానాలు బీజేపీ టార్గెట్ గా పెట్టుకుంది. ఊహించని రీతిలో గతంలో జరిగిన ఎన్నికల్లో 18 సీట్లు బీజేపీ కైవసం చేసుకుంది. ఒక రకంగా టీఎంసీకి కోలుకోలేని షాక్.
ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ వర్సెస్ టీఎంసీగా మారి పోయింది. కానీ అనూహ్యంగా మూడోసారి మమతా బెనర్జీ అధికారంలోకి రాగలిగింది. అయినా ఆమె అడుగడుగునా అడ్డంకులు, ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉంది. కేంద్రం ఛాన్స్ చిక్కినప్పుడల్లా దీదీకి చుక్కలు చూపిస్తున్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు రంగంలోకి ఎంట్రీ ఇచ్చాయి. తాజాగా అమిత్ షా ఏ ప్రాతిపదికన ఇలా మాట్లాడతారంటూ ప్రశ్నించారు సీఎం మమతా బెనర్జీ.
Also Read : యోగి ఈ నేరస్థుల సంగతేంటి