Congress Crisis Goa : బీజేపీ వైపు కాంగ్రెస్ ఎమ్మెల్యేల చూపు
భారతీయ జనతా పార్టీ నేత సిటీ రవి డిక్లేర్
Congress Crisis Goa : దేశంలో తీవ్ర గడ్డు పరిస్థితిని ఎదుర్కోంటోంది సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికే మహారాష్ట్రలో సంకీర్ణ సర్కార్ కూలి పోయింది. ఉన్న పంజాబ్ లో ఉన్న పవర్ ను పోగొట్టుకుంది.
ఆప్ అక్కడ జెండా ఎగురవేసింది. కర్ణాటకలో నువ్వా నేనా అన్నరీతిలో ఉన్నా బీజేపీ వ్యూహాల ముందు ఆ పార్టీ తేలి పోతోంది. రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక విషయంలోనూ సరైన నిర్ణయం తీసుకోలేని స్థితికి చేరుకుంది కాంగ్రెస్(Congress Crisis Goa).
ఈ తరుణంలో తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలతో దేవుడి మీద ప్రమాణం చేసినా వారిలో మార్పు రావడం లేదు. తాజాగా గోవాలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఇప్పటికే భారతీయ జనతా పార్టీకి చెందిన సీఎం ఇంటి ముందు క్యూ కట్టినట్లు సమాచారం.
దీంతో రంగంలోకి సీనియర్లు దిగారు. ఇప్పటికే గోవా రాష్ట్ర ఇన్ చార్జ్ దినేష్ గుండూరావు పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. కానీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు గోడ దాటేందుకు రెడీగా ఉన్నట్లు సమాచారం.
ఇదే సమయంలో పార్టీ చీఫ్ సోనియా గాంధీ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడిని గోవాకు పంపించారు. కాగా ఉన్నట్టుండి బాంబు పేల్చారు బీజేపీకి చెందిన రాస్ట్ర ఇన్ చార్జ్ సిటీ రవి.
కాంగ్రెస్ పార్టీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేలు తమ పార్టీతో టచ్ లో ఉన్నారని, రేపో మాపో చేరనున్నారని ప్రకటించాడు బాహాటంగా. దీంతో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయ్యే పరిస్థితి నెలకొంది.
Also Read : అడ్వయిజరీ కమిటీ చైర్మన్ గా రాఘవ్ చద్దా