Google : వచ్చే నెలలో విశాఖకు గూగుల్ రానుందని సీఎం చంద్రబాబు (CM Chandrababu) ప్రకటించారు. ఇప్పటికే టీసీఎస్ విశాఖలో కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోందన్నారు. ఆర్సెలార్ మిత్తల్ ఉక్కు కర్మాగారం త్వరలో ఏర్పాటు కానుందని పేర్కొన్నారు. కలెక్టర్ల సమావేశంలో పరిశ్రమలు, మౌలిక సదుపాయాలపై ఆయన మాట్లాడుతూ… కూటమి ప్రభుత్వం వచ్చాక ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు అభివృద్ధిలో పోటీ పడుతున్నాయన్నారు. ‘రాయలసీమలో కడప ఉక్కు కర్మాగారం, కొప్పర్తి, ఓర్వకల్లులో పరిశ్రమలను అభివృద్ధి చేస్తున్నాం. రాబోయే రోజుల్లో అనంతపురంలోని లేపాక్షి- కర్నూలులోని ఓర్వకల్లు మధ్య ప్రాంతం భారీ ఇండస్ట్రియల్ హబ్‌గా మారుతుంది. లాజిస్టిక్ కార్పొరేషన్ ద్వారా పోర్టులు, విమానాశ్రయాల మధ్య రోడ్డు నెట్‌వర్క్ అభివృద్ధి చేయాలి. ప్రతి 50 కి.మీ.కు ఒక పోర్టు కానీ, నౌకల తయారీ కేంద్రం కానీ లేదా ఫిషింగ్ హార్బర్ కానీ ఏర్పాటు చేయాలి. వీటితో పాటు కొత్త విమానాశ్రయాల నిర్మాణంతో అక్కడికి సమీపంలో ఉన్న ప్రాంతం ఎకనమిక్ హబ్‌గా మారుతుంది’ అని సీఎం పేర్కొన్నారు.
Google – దసరా సెలవులు ప్రకటించిన ప్రభుత్వం
తెలుగు రాష్ట్రాల ప్రజలకు దసరా అతి పెద్ద పండగ. ఈ పండుగ ఎప్పుడెప్పుడు వస్తుందా? ఎప్పుడెప్పుడు సెలవులు ఇస్తారా అని స్కూల్ విద్యార్థులు ఎంతగానో ఎదురుచూస్తుంటారు. వారే కాదు ఉద్యోగులు సైతం చాలా వెయిట్ చేస్తుంటారు. ఈ క్రమంలో వారికి ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పాఠశాలలకు దసరా సెలవులపై అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు ఈ నెల 24 నుంచి వచ్చే నెల అక్టోబర్ 2 వరకు దసరా సెలవులను ప్రకటించింది. మొత్తం 9 రోజుల పాటు స్కూల్ విద్యార్థులకు దసరా సెలవులు ఇచ్చారు. ఇటు తెలంగాణలోనూ ఈ నెల 21 నుంచి అక్టోబరు 3 వరకు దసరా సెలవులు ప్రకటించారు. అధికారికంగా మొత్తం 13 రోజులపాటు పండగ సెలవులిచ్చారు. వచ్చే నెల 4న స్కూల్స్ తిరిగి ప్రారంభం కానున్నాయి.
Also Read : CM Chandrababu: స్వచ్ఛాంధ్ర ఓ ఉద్యమం – సీఎం చంద్రబాబు
