Google Suspended : ఏఐ ఇంజ‌నీర్ పై గూగుల్ వేటు

స‌మాచార గోప్య‌త‌కు భంగం

Google Suspended : ప్ర‌పంచ టెక్ దిగ్గ‌జం గూగుల్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ కు సంబంధించి గోప్య‌త పాటించ‌లేద‌న్న ఆరోప‌ణ‌లతో సంస్థ‌లో ప‌ని చేస్తున్న బ్లేక్ లెమోయిన్ ను తొల‌గించ‌డం క‌ల‌క‌లం రేపింది.

ఏఐ అనేది బాట్ సెంటింగ్ గా మారింద‌ని పేర్కొన్నారు స‌ద‌రు ఇంజ‌నీర్. సంస్థ‌కు సంబంధించిన గోప్య‌త విధానాన్ని ఉల్లంఘించిన‌ట్లు స్ప‌ష్టం చేసింది.

రీసెర్చ‌ర్ గా ఉన్న స‌ద‌రు ఇంజ‌నీర్ ను వేత‌నంతో కూడిన సెల‌వుపై ఉంచింది. కాగా లెమోయిన్ స‌స్పెన్ష‌న్ గురించి అడిగిన‌ప్పుడు సిబ్బంది విష‌యాల గురించి ఎలాంటి వ్యాఖ్య‌లు చేయ‌లేద‌ని గూగుల్ వెల్ల‌డించింది.

ఇదిలా ఉండ‌గా గూగుల్ ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ డెవ‌ల‌ప్ మెంట్ టీమ్ లోని సాఫ్ట్ వేర్ ఇంజ‌నీర్ గా ప‌ని చేస్తున్నారు బ్లేక్ లెమోయిన్ . ప్రాజెక్టు గురించి ర‌హ‌స్య స‌మాచారాన్ని ఇత‌ర పక్షాల‌తో పంచుకున్నాడ‌నే ఆరోప‌ణ‌లున్నాయి.

కాగా కంపెనికి చెందిన స‌ర్వ‌ర్ ల‌లో సెంటింట్ ఏఐని ఎదుర్కొన్నార‌నేది చ‌ర్చ‌కు దారితీసింది. గూగుల్ ఏఐ ఎథిక్స్ గ్రూప్ లోని మునుప‌టి స‌భ్యులైన మార్గ‌రెట్ మిచెల్ వంటి వారితో సంబంధం క‌లిగి ఉన్నాడ‌ని గూగుల్ అనుమానం వ్య‌క్తం చేసింది.

దీని విష‌యంపై ఆందోళ‌న‌లు లేవనెత్తిన త‌ర్వాత కంపెనీ తొల‌గించింది. కాగా అమెరికాకు చెందిన ప్ర‌ముఖ మీడియా సంస్థ వాషింగ్ట‌న్ పోస్ట్ ఏఐ ఇంజ‌నీర్ లెమోయిన్ తో ఇంట‌ర్వ్యూ చేసింది.

గూగుల్ కు సంబంధించి ఏఐ వివ‌రాలు, ప‌రిశోధ‌న‌కు చెందిన స‌మాచారాన్ని పంచుకున్నాడు. ఏఐకి సంబంధించి అంత‌ర్గ‌తంగా కొన్ని ప్ర‌శ్న‌లు లేవనెత్తాన‌ని అయితే కంపెనీ సీనియ‌ర్ ఎగ్జిక్యూటివ్ లు తిర‌స్క‌రించార‌ని లెమోయిన్ చెప్పారు.

Also Read : భారీగా వ‌డ్డీ రేట్లు పెంచిన ఆర్బీఐ

Leave A Reply

Your Email Id will not be published!