Gopal Krishna Gandhi : రాష్ట్రపతి అభ్యర్థి రేసులో లేను – గాంధీ
విపక్షాలకు కోలుకోలేని షాక్
Gopal Krishna Gandhi : భారతీయ జనతా పార్టీ సంకీర్ణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికకు ఒంటరి పోరు సాగిస్తోంది టీఎంసీ చీఫ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. ఈనెల 15న ఢిల్లీలో విపక్ష పార్టీలతో సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సమావేశానికి 17 పార్టీలు పాల్గొన్నాయి. వైఎస్సార్ సీపీ, టీఆర్ఎస్ , ఎంఐఎం దూరంగా ఉన్నాయి. అఖిలేష్ యాదవ్, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ , మెహబూబా ముఫ్తీ, సంజయ్ రౌత్, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఉమ్మడి పార్టీల అభ్యర్థిగా మమతా బెనర్జీ మొదట శరద్ పవార్ ను ప్రతిపాదించారు. అందుకు అన్ని పార్టీలు ఓకే చెప్పాయి. ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ నుంచి నేతలు హాజరయ్యారు.
ఇదే సమయంలో తాను రాష్ట్రానికే పరిమితం అవుతానని, రాష్ట్రపతి రేసుపై ఆసక్తి లేదని సున్నితంగా తిరస్కరించారు. దీంతో ఇద్దరి పేర్లను ప్రతిపాదించారు మమతా బెనర్జీ.
ఒకరు జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం ఫరూఖ్ అబ్దుల్లా కాగా మరొకరు జాతిపిత మహాత్మా గాంధీ మనుమడు గోపాలకృష్ణ గాంధీని(Gopal Krishna Gandhi) ఇదే సమయంలో ఫరూఖ్ అబ్దుల్లా తాను రాష్ట్రపతి రేసులో లేనని ప్రకటించారు.
తాను రాష్ట్రానికే పరిమితం అవుతానని పేర్కొన్నారు. కానీ అభ్యర్థి ఎవరు ఉన్నా మద్దతు ఇస్తానని తెలిపారు. తాజాగా దీదీకి కోలుకోలేని షాక్ తగిలింది. సోమవారం గోపాలకృష్ణ గాంధీ(Gopal Krishna Gandhi) కీలక ప్రకటన చేశారు.
రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయాలన్న ప్రతిపక్ష పార్టీల అభ్యర్థనను మాజీ గవర్నర్ గాంధీ తిరస్కరించారు. ఈ సందర్భంగా తనను ప్రతిపాదించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.
Also Read : సైబర్ సురక్షిత దేశంగా భారత్ – అమిత్ షా