Presidential Election 2022 : రాష్ట్ర‌ప‌తి రేసులో ‘గాంధీ..ఫ‌రూక్’

మ‌మ‌తా మీటింగ్ లో కీల‌క నిర్ణ‌యం

Presidential Election 2022 :  దేశంలో రాష్ట్ర‌ప‌తి ఎన్నిక(Presidential Election 2022) మ‌రింత వేడి పుట్టిస్తోంది. కేంద్రంలోని మోదీ ప్ర‌భుత్వం బిజేపీయేత‌ర రాష్ట్రాల‌ను, సీఎంలు, మంత్రులు, సంస్థ‌ల‌ను టార్గెట్ చేయ‌డంతో నేరుగా ఎదుర్కొనేందుకు బెంగాల్ బెబ్బులి సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ రంగంలోకి దిగింది.

ఇక రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి గెల‌వాలంటే ఎన్డీయేకు 8 వేల‌కు పైగా ఓట్లు రావాల్సి ఉంది. విప‌క్షాల‌కే ఎక్కువ ఓట్లు ఉన్నాయి. ఈ త‌రుణంలో అన్నాడీఎంకే, జేడీఎస్ తో ఉన్న పొత్తు కాస్తా చెడింది బీజేపీకి.

దీంతో రాష్ట్ర‌ప‌తి ఎన్నిక కీల‌కంగా మారింది. ప్ర‌తిప‌క్షాలతో దేశ రాజ‌ధాని ఢిల్లీలో కానిస్టిట్యూష‌న్ క్ల‌బ్ లో మ‌మ‌తా బెన‌ర్జీ సార‌థ్యంలో విప‌క్షాల నేత‌లు పాల్గొన్నారు.

మాజీ సీఎం అఖిలేష్ యాద‌వ్ , కేంద్ర మాజీ మంత్రి , ఎన్సీపీ చీఫ్ శ‌ర‌ద్ ప‌వార్ , మెహ‌బూబా ముఫ్తీ , కాంగ్రెస్ ఎంపీ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే త‌దిత‌ర కీల‌క నేత‌లు హాజ‌ర‌య్యారు.

ఈ సంద‌ర్భంగా ప‌వ‌ర్ ను రాష్ట్ర‌ప‌తి(Presidential Election 2022) అభ్య‌ర్థిగా ఉండాల‌ని దీదీ కోరింది. కానీ ఆయ‌న పోటీ చేసేందుకు ఒప్పుకోలేదు. దీంతో కొత్త పేర్లు తెర‌పైకి వ‌చ్చాయి.

మ‌హాత్మా గాంధీ మ‌నవ‌డు గోపాల‌కృష్ణ గాంధీతో పాటు మాజీ సీఎం ఫ‌రూక్ అబ్దుల్లా పేర్ల‌ను ప్ర‌తిపాదించింది. ఇందుకు పాల్గొన్న నేత‌లంతా ఓకే చెప్పిన‌ట్లు స‌మాచారం.

ఇందులో భాగంగా త‌మ త‌ర‌పున ఉమ్మ‌డి అభ్య‌ర్థిని ప్ర‌క‌టించేందుకు ఈనెల 17న మ‌రోసారి భేటీ కానున్నారు. కాగా కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ విప‌క్షాల‌కు ఫోన్ చేయ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.

దీదీ కీల‌క భేటీలో కాంగ్రెస్, స‌మాజ్ వాది, ఎన్సీపీ, డీఎంకే, ఆర్జేడీ, శివ‌సేన‌, వామ‌ప‌క్ష పార్ట‌లు పాల్గొన్నాయి. ఇక టీఆర్ఎస్, బిజూ జ‌న‌తాద‌ళ్ , ఆప్ , అకాలీద‌ళ్ , మ‌జ్లిస్ దూరంగా ఉన్నాయి.

Also Read : ఎవ‌రీ గోపాల కృష్ణ దేవ‌దాస్ గాంధీ

Leave A Reply

Your Email Id will not be published!