Gorantla Madhav: మాజీ ఎంపీ, వైసీపీ నేత గోరంట్ల మాధవ్ అరెస్ట్
మాజీ ఎంపీ, వైసీపీ నేత గోరంట్ల మాధవ్ అరెస్ట్
Gorantla Madhav : వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతీపై వ్యాఖ్యలు చేసిన చేబ్రోలు కిరణ్ కుమార్‌పై దాడికి యత్నించిన ఆ పార్టీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ను గుంటూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని నగరంపాలెం పోలీస్ స్టేషన్ కు తరలించారు. చేబ్రోలు కిరణ్‌ను పోలీస్ గురువారం అరెస్ట్ చేశారు. అనంతరం అతడిని వాహనంలో గుంటూరు తరలించే క్రమంలో మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్(Gorantla Madhav) వారి వాహనాన్ని అడ్డుకుని… కిరణ్ పై దాడికి ప్రయ్నతించారు. అయితే మాధవ్ ప్రయత్నాన్ని గుంటూరు పోలీసులు అడ్డుకున్నారు. దీనితో గుంటూరు నగరంలోని చుట్టుగుంట సెంటర్ లో మాధవ్ ను పోలీసులు పట్టుకున్నారు. అనంతరం అతడిని పీఎస్‌కు తరలించారు.
Gorantla Madhav Arrest
మరోవైపు వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతీపై టీడీపీకి చెందిన చేబ్రోలు కిరణ్ కుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అందుకు సంబంధించిన వీడియో వైరల్ అయింది. దీనితో టీడీపీ అధిష్టానం వెంటనే స్పందించింది. చేబ్రోలు కిరణ్‌పై సస్పెన్షన్ వేటు వేసింది. అక్కడితో ఆగకుండా అతడిని వెంటన అరెస్ట్ చేయాలంటూ గుంటూరు జిల్లా పోలీస్ ఉన్నతాధికారులను ఆదేశించింది. ఈ నేపథ్యంలో చేబ్రోలు కిరణ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత అతడిని గుంటూరు తరలిస్తుండగా… ఈ విషయం తెలుసుకున్న గోరంట్ల మాధవ్ వెంటనే అలర్ట్ అయ్యారు. ఆ క్రమంలో చేబ్రోలు కిరణ్‌పై దాడి చేసేందుకు పక్కాగా ప్లాన్ చేసారు. దీనితో చేబ్రోలు కిరణ్‌ను తీసుకు వెళ్తున్న వాహనాన్ని అడ్డుకొని… అతడిపై దాడికి యత్నించడంతో… గోరంట్ల మాధవ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Also Read : Ex MLA Shakeel: బీఆర్ఎస్ నేత, బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ అరెస్ట్