Gottipati Ravi Kumar: ఏపీలో సౌర, పవన విద్యుత్‌ ప్రాజెక్టులను ప్రోత్సహిస్తుం: మంత్రి గొట్టిపాటి

ఏపీలో సౌర, పవన విద్యుత్‌ ప్రాజెక్టులను ప్రోత్సహిస్తుం: మంత్రి గొట్టిపాటి

Gottipati Ravi Kumar: ఆంధ్రప్రదేశ్‌ను విద్యుత్‌ స్టోరేజీకి కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిపే లక్ష్యంతో పనిచేస్తున్నట్టు ఏపీ విద్యుత్‌శాఖ మంత్రి గొట్టిపాటి రవికమార్‌(Gottipati Ravi Kumar) తెలిపారు. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో జరిగిన రెన్యువబుల్‌ ఎనర్జీ ఇన్వెస్టర్స్‌ మీట్‌-2024 లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అపార అవకాశాలు, మానవ వనరుల గురించి వివరించారు. పునరుత్పాదక విద్యుత్‌ ఆధారంగా ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్‌ కోతలు లేకుండా నిరంతరాయంగా విద్యుత్‌ అందించడమే లక్ష్యంగా తాము పనిచేస్తున్నట్టు వెల్లడించారు.

Gottipati Ravi Kumar Comment

సీఎం చంద్రబాబు నాయకత్వంలో తాము కీలక లక్ష్యాలను నిర్దేశించుకున్నట్టు తెలిపారు. లక్ష్యాలను అందుకునే దిశగా సౌర, పవన విద్యుత్‌ ప్రాజెక్టులను ఏపీలో ప్రోత్సహిస్తున్నట్టు వివరించారు. దీంతో పాటు విద్యుత్‌ స్టోరేజీ సాంకేతికత కూడా వినియోగిస్తామన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3.0 సంస్కరణలను అమలు చేస్తున్నామని మంత్రి రవి కుమార్ తెలిపారు. ఇందులో భాగంగా విద్యుత్‌ స్టోరేజీ విధానంపై ప్రధానంగా దృష్టి పెట్టామని చెప్పారు. విద్యుత్ స్టోరేజీకి ఆంధ్రప్రదేశ్‌ను కేరాఫ్ అడ్రస్‌గా నిలిపే లక్ష్యంతో పని చేస్తున్నట్లు పేర్కొన్నారు. రూఫ్‌టాప్‌ సోలార్, డీ- సెంట్రలైజ్డ్‌ మైక్రో గ్రిడ్ల ఏర్పాటుతో విద్యుత్‌ ఉత్పత్తిని ప్రజలకు మరింత చేరువ చేసి, క్షేత్రస్థాయిలో ఇంధన భద్రత పెంచుతామని వివరించారు.

Also Read : CM Revanth Reddy: హైడ్రా వెనుక రాజకీయ కోణం లేదు: సీఎం రేవంత్‌

Leave A Reply

Your Email Id will not be published!