Metro Rail: విజయవాడ, విశాఖ మెట్రో రైలు టెండర్లు ఆహ్వానానికి ముహూర్తం ఖరారు
విజయవాడ, విశాఖ మెట్రో రైలు టెండర్లు ఆహ్వానానికి ముహూర్తం ఖరారు
Metro Rail: ఏపీలో కీలక మెట్రో ప్రాజెక్టులకు మరో ముందడుగు పడింది. విజయవాడ, విశాఖపట్నంలో మెట్రో రైలు నిర్మాణానికి చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. దీనిలో భాగంగా ఈ మెట్రో ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించిన టెండర్లు పిలిచేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ప్రాజెక్టు వ్యయంలో 40శాతం పనులకు తొలుత టెండర్లు పిలవనుంది. ఆ క్రమంలో ప్రభుత్వం శుక్రవారం టెండర్లు పిలవనుంది. రూ.21,616 కోట్లతో విశాఖపట్నం, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులకు టెండర్లను ఆహ్వానించనుంది.
Metro Rail Tenders
అందులో రూ. 10,118 కోట్లతో విజయవాడ, రూ. 11,498 కోట్లతో వైజాగ్ మెట్రోలకు టెండర్లు పిలవనున్నారు. ఈ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు… 50:50 భాగస్వామ్యంతో నిర్మించనున్నారు. వైజాగ్ మెట్రో రైలుకు విఐఎంఎంఆర్డీఏ నుంచి రాష్ట్ర ప్రభుత్వ వాటాగా రూ. 4,101 కోట్ల నిధులు మళ్లించనున్నారు. అలాగే విజయవాడ మెట్రోకు సీఆర్డీఏ నుంచి రూ.3,497 కోట్లు రాష్ట్ర ప్రభుత్వ వాటాగా నిధులు మళ్లించనున్నారు.
Also Read : Bogatha Water Falls: పరవళ్లు తొక్కుతున్న బొగత జలపాతం ! సందర్శనకు అనుమతి నిరాకరణ !
