Amaravati: అమరావతి భూ కేటాయింపులపై ప్రభుత్వం సంచలన నిర్ణయం
అమరావతి భూ కేటాయింపులపై ప్రభుత్వం సంచలన నిర్ణయం
Amaravati : ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో పలు సంస్థలకు భూ కేటాయింపులు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ (GoM) సిఫార్సుల మేరకు ఈ కేటాయింపులు చేసింది. గెయిల్, అంబికా సంస్థలకు గతంలో ఉన్న భూ కేటాయింపులను రద్దు చేసింది. అంతేకాదు గతంలో 6 సంస్థలకు ఇచ్చిన భూములపై సవరణలు చేసి మళ్లీ కేటాయించడంతోపాటు కొత్తగా 7 సంస్థలకు 32.4 ఎకరాలు 60 ఏళ్ల లీజు ప్రాతిపదికన కేటాయిస్తున్నట్లు వెల్లడించింది.
Amaravati – Govt Key Comments
ఆ క్రమంలో బీజేపీ (BJP) రాష్ట్ర కార్యాలయానికి 2 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. 60 ఏళ్ల లీజు ప్రాతిపదికన పలు సంస్థలకు ఈ భూములు కేటాయించింది. ఇక గెయిల్ కు 0.40, అంబికాకు ఎకరా భూమి కేటాయింపులను రద్దు చేసింది. అందుకోసం తగిన చర్యలు తీసుకోవాలని సీఆర్‌డీఏ కమిషనర్‌ను ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్. సురేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. అలాగే వివిధ సంస్థలకు ఏపీసీఆర్డీఏ భూములు కేటాయింపుపై 18వ మంత్రి వర్గ ఉప సంఘం నిర్ణయాలకు పరిపాలన అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జీవో ఎంఎస్ నెంబర్ 122 జారీని మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్. సురేష్ కుమార్ జారీ చేశారు.
జూన్ 23వ తేదీన జరిగిన మంత్రి వర్గ ఉప సంఘం భూములు కేటాయింపు… పున: పరిశీలన, కొత్తగా కేటాయింపు చేస్తూ పలు ప్రతిపాదనలు ప్రభుత్వానికి సమర్పించింది. ఈ ప్రతిపాదనలను జులై 5వ తేదీన జరిగిన 50 సీఆర్డీఏ అథారిటీ ముందు కమిషనర్ ఉంచారు. దీంతో సదరు ప్రతిపాదనలు ఆమోదిస్తున్నట్లు ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.
‘స్పేస్ పాలసీ’ని ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
ఏపీ (AP) ప్రభుత్వం స్పేస్ పాలసీని ప్రకటించింది. ఐదేళ్లపాటు అమలులో ఉండేలా మార్గదర్శకాలు జారీ చేసింది. స్పేస్ పాలసీ అమలుకు ఏపీ స్పేస్ సిటీ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని అధికారుల్ని ఆదేశించింది. అంతరిక్ష ప్రాజెక్టుల విషయంలో పెట్టుబడిదారులకు ఈ కార్పొరేషన్ సాయం చేస్తుందని వెల్లడించింది. మౌలిక వసతుల అభివృద్ధి, స్టార్టప్ నిధులు, పెట్టుబడులను ఆకర్షించాలని.. దేశీయ, అంతర్జాతీయ సంస్థలతో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకోవాలని కార్పొరేషన్‌కు నిర్దేశించింది. శ్రీసత్యసాయి, తిరుపతి జిల్లాల్లో స్పేస్ సిటీలు ఏర్పాటు చేస్తామని పేర్కొంది. భూ కేటాయింపు, దరఖాస్తుల పరిశీలనకు కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించింది.
Also Read : Kendriya Vidyalaya: కోనసీమలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్
