AP Free Bus: ఉచిత బస్సు ప్రయాణంపై మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం
ఉచిత బస్సు ప్రయాణంపై మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం
AP Free Bus : సూపర్ సిక్స్ పథకాలు అమలులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 15 నుంచి ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేస్తామని ఏపీ రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు. ‘శ్రీ శక్తి’ పేరుతో ఈ పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారని చెప్పారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక సూపర్ సిక్స్ పథకాలు ఒక్కోక్కటి ప్రజలకు చేరువ చేస్తున్నట్లు తెలిపారు. దానిలో భాగంగానే రాష్ట్రంలోని మహిళలకు అందరికి ప్రీ బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు.
AP Free Bus – Key Orders
‘‘మహిళలకు ఉచిత బస్సు (AP Free Bus) ప్రయాణం పథకం సమర్థంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. రాష్ట్రంలో ఎక్కడికైనా మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు. దీనికోసం జీరో టికెటింగ్ విధానం అమలు చేస్తున్నట్లు చెప్పారు. పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, మెట్రో ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేయొచ్చు. మహిళలు తమ ఆధార్, ఓటర్ ఐడీ, రేషన్‌కార్డుల్లో ఏదో ఒకటి చూపించాల్సి ఉంటుంది. 6,700 బస్సుల్లో ఈ పథకాన్ని అమలు చేస్తున్నాం. దీనికోసం ఏడాదికి రూ.1,950 కోట్ల వ్యయం అవుతుంది. 3వేల విద్యుత్ బస్సుల కొనుగోలుకు సీఎం ఆదేశించారు. రానున్న రెండేళ్లలో 1,400 ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేస్తాం’’ అని మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు.
Also Read : New Liquor Policy: మందు బాబులకు కూటమి సర్కార్ గుడ్ న్యూస్
