Tirupati By-election: తిరుపతి దొంగ ఓట్లు కేసులో మరో అధికారిపై వేటు !
తిరుపతి దొంగ ఓట్లు కేసులో మరో అధికారిపై వేటు !
Tirupati By-election: తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో ఎపిక్ కార్డుల డౌన్ లోడ్ వ్యవహారంలో మరో అధికారిపై వేటు పడింది. ఎన్నికల సంఘం ఆదేశాలతో ప్రస్తుతం విజయవాడ మెప్మా అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్న చంద్రమౌళీశ్వర్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తిరుపతి ఉప ఎన్నిక సమయంలో నగరపాలక సంస్థ సహాయ కమిషనర్ గా పనిచేసిన చంద్రమౌళి… ఆ తరువాత విజయవాడ మెప్మా అసిస్టెంట్ డైరెక్టర్ గా బదిలీ అయ్యారు. ఆర్ వో లాగిన్‌తో 30 వేల ఓటరు కార్డులు డౌన్‌లోడ్ చేశారని ఆరోపణలు వచ్చాయి. దొంగ ఓట్ల వ్యవహారంలో ఇప్పటికే అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీషా సస్పెండ్ చేసారు. ఈ ఎపిక్ కార్డుల డౌన్ లోడ్ వ్యవహారంతో మరి కొంతమంది ప్రమేయం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపధ్యంలో మెప్మా అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్న చంద్రమౌళీశ్వర్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం రాష్ట్రంలో సంచలనంగా మారింది.
Tirupati By-election Viral
ఇటీవల జరిగిన తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో ఓటర్ల జాబితాలో అక్రమాలు చోటు చేసుకున్నాయని పలువురు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఉప ఎన్నికల సమయంలో తిరుపతి(Tirupati) కార్పోరేషన్ కమీషనర్ గా పనిచేస్తున్న గిరీషా యొక్క డిజిటల్ లాగిన్ ను కొంతమంది అధికార పార్టీ నేతలు దుర్వినియోగం చేసి సుమారు 30 వేలకు పైగా ఎపిక్ కార్డులను అక్రమంగా డౌన్ లోడ్ చేసారని ఆరోపిస్తూ బిజేపి నాయకులు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసారు.
ఈ నేపథ్యంలో ఎపిక్ కార్డుల అక్రమ డౌన్ లోడ్ పై విచారణ చేపట్టిన కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు… అప్పటి ఆర్వో, ప్రస్తుతం అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీషా యొక్క డిజిటల్ లాగిన్ దుర్వినియోగం అయినట్లు నిర్దారించారు. వేల సంఖ్యలో ఎపిక్ కార్డుల్ని డౌన్ లోడ్ చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీషాను సస్పెండ్ చేస్తూ… సీఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేసారు. ఈ కేసుతో సంబంధం ఉన్న మరో అధికారిపై తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం చర్యలకు ఉపక్రమించింది.
Also Read : CM Revanth Reddy: గ్రూప్-1 అభ్యర్థులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్ !