Governor Haribhavu Bhgde: రాజస్థాన్ గవర్నర్ కు తృటిలో తప్పిన ప్రమాదం

రాజస్థాన్ గవర్నర్ కు తృటిలో తప్పిన ప్రమాదం

Haribhavu Bhgde : రాజస్థాన్ గవర్నర్ హరిభావు బాగడే కు తృటిలో ప్రమాదం తప్పింది. శనివారంనాడు గవర్నర్ హరిభావు బాగడే(Haribhavu Bhgde) ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ నుంచి ఒక్కసారిగా పొగలు వచ్చాయి. రాజస్థాన్‌ లోని పాలి నుంచి హెలికాప్టర్ గాలిలోకి లేచిన సెకన్లలోనే ఈ ఘటన జరిగింది. దీనితో అప్రమత్తమైన పైలట్ చాకచక్యంగా హెలికాప్టర్‌ ను కిందకు దించడంతో పెను ప్రమాదం తప్పింది. దీనితో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. పైలట్ అప్రమత్తతతో ప్రమాదం తప్పినట్టు అధికారులు ప్రకటించారు. కాగా ఈ ఘటన గవర్నర్ భద్రత, హెలికాఫ్టర్ కండిషన్‌ పై తీవ్ర సందేహాలు, ఆందోళనలకు తావిచ్చింది. అయితే ఈ ఘటనకు పూర్తి కారణాలు వెంటనే తెలియలేదు.

వీవీఐపీల భద్రతకు ముఖ్యంగా విమాన ప్రయాణంలో అధికారులు తీసుకుంటున్న చర్యలపై సందేహాలు వ్యక్తమౌతున్నాయి. టెక్నాలజీ ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతున్నప్పటికీ… మానవ తప్పిదాల వలన కొన్నిసార్లు ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయి. ప్రకృతి విపత్తులు కంటే… ఇటువంటి మానవ తప్పిదాలు… వీవీఐపీలతో పాటు సాధారణ ప్రయాణీకుల భద్రతపై కూడా అనుమానాలు వ్యక్తమయ్యేలా చేస్తున్నాయి.

Haribhavu Bhgde – విమానంలో బీడీ తాగి దొరికిపోయిన బెంగాల్ వ్యక్తి

ఓ ప్రయాణికుడు సూరత్‌ – కోల్‌కతా విమానంలో బీడీ తాగుతూ సిబ్బందికి దొరికిపోయాడు. సూరత్‌ నుంచి కోల్‌కతాకు వెళ్లాల్సిన విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో టేకాఫ్‌ ఆలస్యం అయింది. దీనితో ప్రయాణికులు వేచి ఉండాల్సి వచ్చింది. ఆ సమయంలో విమానంలోని వాష్‌రూమ్‌ నుంచి పొగ రావడం గమనించిన సిబ్బంది అధికారులకు సమాచారం అందించారు. చేపట్టిన తనిఖీల్లో పశ్చిమబెంగాల్‌ కు చెందిన అశోక్‌ బిశ్వాస్‌ బ్యాగులో బీడీలు, అగ్గిపెట్టె గుర్తించారు. బీడీ తాగింది అతడేనని నిర్ధారించుకొని విమానం నుంచి దించేశారు. అశోక్‌ బిశ్వాస్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Also Read : M Venkaiah Naidu: ఉచితాలపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆశక్తికర వ్యాఖ్యలు

Leave A Reply

Your Email Id will not be published!